తిరుపతి లో అట్టహాసం గా జరిగిన మహానాడు మీద వైకాపా లీడర్ భామన కరుణాకర్ రెడ్డి సీరియస్ అయ్యారు . అక్కడ జరిగింది ఆది మానవుల ఆటవికమైన జాతర అనీ మహానాడు కానే కాదు అనీ అన్నారు ఆయన. మహానాడు లో దాదాపు నూట యాభై మంది ఎమ్మెల్యే లు జగన్ గురించే మాట్లాడారు అని దీని బట్టీ చూస్తేనే జగన్ ఇన్నేళ్ళ లో ప్రతిపక్ష నాయకుడిగా ఎంత విజయవంతం అయ్యారు అనేది కళ్ళకి కట్టినట్టు తెలుస్తోంది అని కరుణాకర్ రెడ్డి అభివర్ణించారు.టీడీపీ చేస్తున్న ప్రతీ పనీ ప్రతిపక్షాన్ని కాపాడుతోంది అని చెప్పారు.

 

 

వెంకటేశ్వర స్వామి కి వైభవం తీసుకువచ్చింది కూడా తామే అని చెప్పుకోవడం చంద్రబాబు కి మాత్రమే చెల్లింది అని ఆయన కొట్టే డబ్బా ఎవ్వరూ కొట్టుకోలేరు అని ఆయన ఎద్దేవా చేసారు. సీనియర్ ఎన్టీఆర్, టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు కి నూట పదిహేను అడుగుల విగ్రహం కట్టిస్తాం అని , అమరావతి లో దాన్ని పెడతాం అని చంద్రబాబు చేసిన మాటలకి స్పందించిన కరుణ ఆయన బతికి ఉన్న సమయం లో వెన్నుపోటు పొడిచి నూట యాభై అడుగుల లోతులో పూడ్చి పెట్టిన విషయం గుర్తుచేసుకోవాలి అన్నారు. ఎక్కడ పడితే అక్కడ పెడుతున్న సీసీ కేమేరాలని దమ్ముంటే సీఎం కార్యాలయం లో పెట్టించాలి అని అన్నారు.

 

 

తుని ఘటన విషయం లో ఇప్పటి వరకూ ఎలాంటి చర్యా తీసుకోలేదు అని దాని మీద సీబీఐ విచారణ జరగాలి అని ఆయన డిమాండ్ చేసారు. వంగవీటి రంగా హత్యాకాండ వెనకాల టీడీపీ ఉంది అనేది హరిరామ జోగయ్య ఎప్పటి నుంచో చేస్తున్న ఆరోపణ కాగా ఆ విషయం మీద బాబు గారు ఒక్కసారి కూడా స్పందించలేదు ఏంటి అని కరుణ ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డిని నిర్మూలించడం కోసం చంద్రబాబు కొత్త కొత్త ప్లాన్ లు చేస్తున్నారు అనే అనుమానాలు ఆయన మాటల వలన అనిపిస్తోంది అని కరుణ చెప్పుకొచ్చారు. వైఎస్ అనుమానాస్పద మృతి వెనకాల చంద్రబాబు ఉండే ఛాన్స్ ఉందన్నారు కరుణ.


మరింత సమాచారం తెలుసుకోండి: