ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశం కోసం ఐసెట్ పరీక్ష రాసిన ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల ఉత్కంఠ వీడింది. కితెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 19న నిర్వహించిన ఐసెట్-2016 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ఉన్నత  విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి, కేయూ ఇన్‌చార్జ్ వీసీ టి.చిరంజీవులు ఈ ఫలితాలను విడుదల చేశారు. 


ఈనెల 19న తెలంగాణ ఐసెట్‌ జరిగింది. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 127 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. అదే రోజు పరీక్ష అనంతరం ప్రాథమిక కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించారు. ఈ రోజు ఫలితాలతో పాటు ఫైనల్ కీ విడుదల చేశారు. అభ్యర్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీఎస్‌ఐసెట్-2016.ఓఆర్‌జీ వెబ్‌సైట్ ద్వారా మార్కుల వివరాలు తెలుసుకోవచ్చు. 

ఇక ఏపీ ఐసెట్ ఫలితాలు గత శుక్రవారమే విడుదలయ్యాయి.  తిరుపతి లోని ఎస్వీ యూనివర్శిటీ సెనెట్ హాల్లో మంత్రి గంటా ఏపీ ఐసెట్ ఫలితాను విడుదల చేశారు.ఆంధ్రా యూనివర్శిటీ నిర్వహించిన ఐసెట్ పరీక్షను 64,490 మంది అభ్యర్థులు రాయగా 54,498 మంది ఉత్తీర్ణులు అయినట్లు ఆయన చెప్పారు. ఉత్తీర్ణులైన మొత్తం విద్యార్థుల్లో పురుషులు 63శాతం ఉండగా ,మహిళలు 36 శాతం ఉన్నారని మంత్రి తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: