బ్యాంకును మోసం చేసిన కేసులో మాజీ మంత్రి, కదిరి నియోజకవర్గ వైకాపా నేత మహమ్మద్ షాకీర్ కు సీబీఐ న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే ప్రసాద్, బ్యాంకు మేనేజర్ తో పాటు మొత్తం ఐదుగురికి ఇదే శిక్షను విధిస్తున్నట్టు తెలిపింది. నకిలీ డీడీలతో పంజాబ్‌నేషనల్‌ బ్యాంక్‌ను మోసం చేసినట్లు తేటతెల్లమైంది. మాజీ మంత్రి షాకీర్‌కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 5 లక్షల జరిమానా కోర్టు విధించింది. ఆయనతో పాటు సహ నిందితుడు టీడీపీ ఇన్‌‌చార్జ్ కందికుంట వెంకటప్రసాద్‌కు ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 6 లక్షల జరిమానా విధిస్తూ సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది.

 

కాగా, కదిరి స్టేట్‑బ్యాంకు ఆఫ్ ఇండియా - వ్యవసాయ అభివృద్ధి బ్యాంకు (ఎస్‑బీఐ-ఏడీబీ)లో జరిగిన మోసాలపై కేసు నమోదు కాగా, రైతులకు మంజూరైన పంటల బీమాను, ఇన్ పుట్ సబ్సిడీని వీరు స్వాహా చేసినట్టు ప్రధాన ఆరోపణ. బ్యాంకు అధికారుల సాయంతో బోగస్ ఖాతాలను తెరిచిన వీరు రూ. కోటికి పైగా డబ్బు కాజేసినట్టు గతంలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన కోర్టు కొద్దిసేపటి క్రితం శిక్షలను ఖరారు చేసింది.

 

18 ఏళ్ల క్రితం రూ. 10 కోట్ల మేర మోసానికి పాల్పడినట్టు అధికారులు నిర్ధారించారు. కందికుంట వెంకటప్రసాద్‌ అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నేత. కాగా మీడియాతో మాట్లాడిన ప్రసాద్..హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ వేస్తాము..నిర్ధోషిగా బయటికి వస్తానని చెప్పారు. కోర్టు నుంచి నేరుగా ఇరువురిని జైలుకు పంపారు. వీరిద్దరే కాకుండా మరో ఎనిమిది మందిపై 18 ఏళ్ల క్రితం కేసు నమోదైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: