మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దేశంలోని అతి పెద్ద ఆయుధకర్మాగారాల్లో ఒకటైన ముంబయిలోని పల్గావ్    ఆయుధాగారంలోఈ  ప్రమాదం సంభవించింది. ఘటనలో 17 మంది చనిపోగా మరో 19 మందికి తీవ్రగాయాలయ్యాయి.   మృతుల్లో ఇద్దరు అధికారులు, 15 మంది జవాన్లు ఉన్నట్టు తెలుస్తోంది. పైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. మరోవైపు హారాష్ట్ర పల్గాన్‌లోని ఆయుధాగారం పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోడీ సంతాపం తెలిపారు.

ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడిన మరో 19 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రక్షణమంత్రి మనోహర్ పారికర్‌ను వెంటనే ఘటనా స్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాల్సిందిగా కోరానని ఆయన తెలిపారు. మరోవైపు ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ కూడా పుల్గావ్‌కు బయల్దేరారు.

ఇక ఈ దారుణమైన ఘటనకు సంబంధించి  తనకు తెలిసిన సమాచారం ప్రకారం మంటలు అదుపులోకి వచ్చాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. అక్కడకు కావల్సిన సహాయం, వనరులు, ప్రాథమిక వైద్య సదుపాయాలు అన్నీ అం దిస్తున్నామన్నారు. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని, భారీ మొత్తంలో ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: