మహనాడు లో సాధారణం గా అధికారపక్షం తాము అమలుచేసిన  ప్రజాహిత కార్య క్రమాల లోపాలను, అమలును పరిశీలిస్తారు. కొత్త కార్యక్రమాలపై చర్చిస్తారు. కాని ఈ సారి బహు విచిత్రం గా శాసనసభ లోనే తమ సంఖ్యను క్రమంగా కోల్పోతూ బలహీన మౌతున్న ప్రతి పక్షాన్ని ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుణ్ణి టార్గెట్ చేస్తూ కొనసాగించిన ఆక్షేపణల పర్వం తెలుగు జాతికే అవమానం, అసహ్యం, అసహనం కలిగించిందని చెప్పవచ్చు.

 

నాటి మహనాడు లో తెలుగు దేశం అద్భుతంగా వెలిగిపోయింది. నేడు పూర్తిగా వెలవెల పోతూ, బాబుగారి, వారి బహుముఖ ప్రజ్ఞాశాలి “పుత్ర విదురుని”  స్తుతి, ప్రతిపక్షనేత జగన్ పై నిందలతో ముగిసిపోయింది. ప్రజలు ఎన్నుకున్న ప్రతిపక్షనాయకుడు ముద్దాయేగాని,  నేరస్తుడని  నిర్దారింప బడలేదు. కాని విదేశీ న్యాయస్థానాల్లో మారిషస్ బ్యాంకు ను బురిడీ కొట్టించి  నేరస్తుడి గా నిర్దారింపబడ్డ, సుజానా చౌదరిని అధికార పక్షం ఏ నైతికత తో రాజ్య సభకు పంపుతుంది ఎం.పి గా, అలాంటి నేరస్తుణ్ణే కేంద్రం,  మంత్రి మండలిలోకి ఎలా తీసుకుంటుంది? ఇక్కడలేని నైతికత జగన్ విషయములో ఎందుకు?

 

ఒకప్పుడు అబద్ధాన్ని పదే పదే చెపితే నిజమౌతుందనే గోబెల్ సూక్తి,  ఇప్పుడు అసహ్యం, అసహనం, కంపరం కలిగిస్తుండని దీనిని “చంద్రబాబు సూక్తి ముక్తావళి”  గా పేర్కొనవచ్చు.   బాబు పదేపదే ఏదైనా చెబితే దీంట్లో ఏదో గోల్-మాల్ల్ ఉందను కుంటున్నారు జనాలు. ప్రతిపక్ష నాయకుడు జగన్ దుర్మార్గం, దౌర్జన్యం, అవినీతి, మనీలాండరింగ్,  ఈ.డి - సి.బి.ఐ లాంటి దర్యాప్టు సంస్థల కేసులు, న్యాయస్థానాల పరిశీలనలో ఉన్న అనేక కేసుల  బలమైన కుడ్యాల వెనుక మాటువేసి, తాము చేస్తున్న అవినీతి, అన్యాయం, ఆశ్రితపక్షపాతం, భూదందా, భూదోపిడి, ఏకపక్ష నిర్ణయాలు, రాజధాని పెరుతో సంపద పోగేసుటున్న టిడిపి నాయకత్వ వైనం బట్టబయలుచేయాలి అని అనేక  పత్రిక, టివి కార్య క్రమాల్లో రచ్చబండల వద్ద కూడా సాధారణ  ప్రజలు ఎలుగెత్తి కోరుతున్నారు.

 

అమరావతి పరదా వెనుక కొత్త కొత్తగా మాఫియాలు పుట్టించి  ఉదాహరణకు  ఇసుక, కల్తీ, లైంగిక, కాల్-మని, మధ్యం, విద్య, వైద్య,  వడ్డీవ్యాపార, అగ్రి గోల్డ్ లాంటి స్కాముల నుండి సొమ్ములు పిండే రస వద్ఘట్టాలను  మరియు మీడియా రంగo, గుత్తేదార్ల గుత్తాధిపత్యం  పొందటంలో విజయం సాధించింది  టిడిపి మరియు వారి పరిజనం. 

 

శాసన, అధికార, న్యాయ వ్యవస్థల పై దొడ్డిదారిన, చట్టంలోని కంతల సందులోనుండి  ధర్మ, న్యాయాలను ధిక్కరించి అవసరమైతే వాటిని పాతరేసి,  అనధికారంగా  పట్టుసాధిస్తూ వ్యవస్థలను మానేజ్ చేసే రాక్షస ఎత్తుగడలను కొనసాగిస్తూ దోపిడీలు సాగించే వైఖరి,  ఇకనైనా తెలుగుదేశం ప్రభుత్వం విడనాడాలి. రానున్న కాలములో అమరావతి ఒకటే కాదు మిగతా రాష్ట్రo  లో కూడా ఓట్లు వేసే అధికారం ప్రజలు కలిగిఉన్నారు.  ప్రజాస్వామ్య కంతలు నుండి జారి పడ్డ చత్తీస్-గఢ్ విషయములో బిజేపి నేర్చుకున్న పాఠం మీరూ గుర్తెరిగితే మంచిది.

 

కాంతా, కనకాలు, కాంట్రాక్టులు, బ్లాక్-మెయిలింగులు , పాత కేసుల నుండి విముక్తి, కొత్త కేసుల ఎత్తివేతల ఆశ చూపి,  "నాడు రావణుడు పరకాంతల నెత్తుకెళ్ళినట్లు ప్రతి పక్షం లోని అటు ఇటు కాని  ఎం.ఎల్.ఏ లను ఎత్తు కెళ్ళే  రాజకీయాలకు “ ఆలవాలమై పోతుందీ  తెలుగుదేశం పార్టీ పాలనలో ఈ రాష్ట్రం, అని అమరావతీ లో వసించే ప్రతి ఆంధ్రుడూ ప్రవచిస్తున్నారు.



 

జగన్ (అనే మీదృష్టి లోని)  పాపాల  కుడ్యాన్నే రక్షణ గా చేసుకుని రెండేళ్ళు టిడిపి అప్రతిహతంగా సాగించిన ధారుణ మారణ హోమాన్ని 'ఎం.ఎల్.ఏ. రొజా' శాసన సభ లో అన్నీ అవమాలను భరించి సవాల్ చేశారు. విషయాలను విషాలను కూడా న్యాయ వ్యవస్థ దృష్టికి తీసుకెళ్ళారు. ఆమె పోరాటములో దొర్లిన అన్-పార్లమెంటరీ, సాంకేతిక  తప్పిదాల మాటునుండి ‘మహాభారత  శకుని’  తరహా ఎత్తుగడలు వేసి రోజా ను సభ నుండి వెలుపలికి పంపించినా,  టిడిపి తప్పిదాలు జనం లోకి తీసుకోవటములో రోజా కృతకృత్యులయ్యారు.  నేడు పాపం రోజా అన్న జనం ఆమెను యాజ్ఞసేని ని చేసినా ఆశ్చర్యం లేదు. ఇక ఆ అగ్నే ఈ దురాగతాల పాలకులను దహించటానికి మూడేళ్ళ సమయం సరిపోదా అంటున్నారు.


 

 

అరణ్యవాసంలో అన్నంపెట్టారని ఇప్పుడు తన దరి చేరిన అప్పుడెప్పుడో సుజానా చౌదరికి కృతజ్ఞతగా రాజ్యసభ సీటిచ్చి గెలిపించి, కేంద్రంలో పదవిచ్చి సత్కరించిన తీరు వర్ణనతీతము. సుజానా చౌదరిని అవక్ర విక్రముడని విదేశ బ్యాంకు తేల్చినా కేసు, గెలిచినా, కెంద్రమంత్రి పదవి చాటున, మాటేసి చివరకు మన ఉన్నత న్యాయస్థానం తో మొట్టికాయ లేంచుకున్న సిగ్గులేకుండా మరల రాజ్యసభకు నామినేట్ చేయటం దుర్మార్గం కాదా! ఇంతటి అవినీతి అనకొండని, దేశ పరువు ప్రతిష్ఠని విదేశాల్లో మంటగలిపిన, ఈ  సుజానా నే హృదయానికి హత్తుకునే టిడిపి,  జగన్ ను తప్పుపట్టటం “గురివింద తన కింద నలు పెరగదన్న”  చందమే గదా! మరి ఈ నేరగ్రస్థ టిడిపి వాళ్ళు హిందీ బాష లోని ‘గదా’ లే కదా!  అంటున్నారు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ముక్త కంఠం తో.

 

 

ఏమైనా జనం గమనిస్తున్నారబ్బా! పైసాకి కొరగాని నేరగాళ్ళు, మాఫియా గాళ్ళు మనవాళ్ళైతే మనకు మహనీయులే అనే సూక్తి సర్వదా శరణ్యం కాదు. రానున్న కాలం ఎన్నికలకు దగ్గరయ్యే సమయం. సుజానా లాంటి అంతర్జాతీయ ఆర్ధి నేరగాణ్ణి మనం రాజ్యసభ ఎం.పి. పదవిచ్చి పోషిస్తే మనలని జనం నిప్పు అని ఏలా అంటారో మనమిలా ముందు ముందు నిప్ప అని మనగురించి చెప్పుకో గలమా? అనే జనానికి చెప్పులతో కొట్టించుకోకుండా ఏం చెపుతామో నిర్ణయించుకోవాలి. మనం రాజ్యసభ ఎం.పి చేస్తాం, మన మిత్రపక్షం కేంద్రంలో మళ్ళా మంత్రి పదవి ఇచ్చి ఇబ్బందుల్లో పడదా?

 

ఇక మేం ఈయన్నే ఎం.పి చేస్తాం ఏం పీక్కుంటారో పీక్కొండని అంటే జనం సమాధానం 2019 ఎన్నికల్లో వెండితెరపై చూపిస్తామటున్నారు. ఇక టిడిపి దారు లన్నీ పతనోదయం వైపే......  వ్విపోదురుగాక, నాకేటి సిగ్గు 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: