ఏపీ ప్రభుత్వం పెద్దల సభ అయిన రాజ్యసభకు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ లాంటి బడా వ్యాపారులు వెళ్తుంటే, మాపార్టీ నుండి మాత్రం ప్రజలకోసం పనిచేసే నాయకులు వెళ్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ విమర్శించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ కు నాలుగు రాజ్యసభ స్థానాలు కేటాయించడం మనకు విదితమే.


అయితే ఇందులో ఒక్కటి వైసీపీ కి దక్కగా మిగతా మూడింటిలో ఒక్కటి టీడీపీ, బీజేపీ మిత్రపక్షానికి దక్కింది. మిగితా ఒక్కటి మాత్రం వైసీపీ అధినేత జగన్ విజయ సాయి రెడ్డి ని పంపిస్తున్న విషయం అందరికీ విదితమే. టీఆర్ఎస్‌కు, టీడీపీకి ఉన్న తేడా అదేనని ఆయన అన్నారు. రాజ్యసభ ఎన్నికల అభ్యర్ధుల నామినేషన్‌కు మంగళవారం చివరి రోజు కాడవంతో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పార్టీల నుంచి ఎంపికైన అభ్యర్ధులు మంగళవారం నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.


తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఆరు రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి. తెలంగాణ నుండి సీనియర్ నాయకులు డీ శ్రీనివాస్, కెప్టన్ లక్ష్మీ కాంతరావు లను టీఆర్ఎస్ అధినాయకత్వం ఖరారు చేసింది.
వీరిద్దరూ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ పై విధంగా స్పందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: