ఐఏఎస్ అధికారులపై మంత్రి టిజి వెంకటేశ్ చేసిన వ్వాఖ్యలు ఇరువర్గాల మద్యన దూరం పెంచేవిధంగా కనిపిస్తున్నాయి. గత కొంత కాలంగా ఐఏఎస్ లు మంత్రుల మధ్యన అంతర్గత వైరుధ్యాలు బహిర్గత మవుతున్నాయి. కొన్ని కేసుల్లో కొంత మంది ఐఏఎస్ లు సిబిఐ విచారణలు, అరెస్టులను ఎదుర్కోవడం, మంత్రులకు న్యాయ సహాయం అందజేయడం కోసం నిర్ణయించడం, ఐఏఎస్ అధికారులకు న్యాయ సహాయంపై నిర్ణయం తీసుకోక పోవడంతో కొద్ది రోజులుగా ఐఏఎస్ అధికారులు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఇదే సమయంలో మంత్రి టిజి చేసిన వ్యాఖ్యలు, వాటిని మంత్రి సమర్థించుకోవడంపై విమర్శలకు తావిచ్చింది. మంత్రి హోదాలో ఉన్నటు వంటి టిజి వెంకటేశ్ పనిచేయని ఐఏఎస్ అధికారులను కాల్చిపారేయాలంటూ మాట్లాడడంపై అధికార్లు, అన్నిపార్టీల నాయకులతో పాటు అధికార పార్టీ నాయకులు సైతం తప్పు పడుతున్నారు. ఇలా రెండు వర్గాల మధ్యన రాజుకుంటున్నటు వంటి అగ్గి ఇంతటితో చల్లారుతుందా లేదా మరింత రాజుకుంటుందా అనేది ప్రశ్నగా మిగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: