ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయ యుద్ధం గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. జగన్ పార్టీని వీక్ చేయాలని బాబు పగబట్టిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఆ పార్టీ నుంచి వలసలను ప్రోత్సహిస్తున్నారు. అందులో చాలా వరకూ సక్సస్ కూడా అయ్యారు. దాదాపు 17 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే జగన్ ను వీడి బాబు పంచన చేరిపోయారు. 

అలాంటి సమయంలో బాబు ఫెయిల్ అవ్వడం ఏంటి.. జగన్ సక్సస్ అవ్వడం ఏంటి అన్న అనుమానం రావచ్చు.. దానికీ ఓ రీజన్ ఉంది. తన పార్టీలోకి వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంలో చంద్రబాబు సక్సస్ అయ్యినా.. విజయసాయిరెడ్డిని పార్లమెంట్ గడప తొక్కకుండా మాత్రం చేయలేకపోతున్నారు. మీడియా ముందు సవాల్ విసరలేదు కానీ.. టీడీపీ విజయసాయిరెడ్డిని పార్లమెంటులో అడుగుపెట్టకుండా చేయాలని చాలా ప్రయత్నించింది. 

విజయసాయిని అడ్డుకోలకేపోయిన చంద్రబాబు.. 



రాజ్యసభ ఎన్నికలు వస్తే వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అవుతాడని తెలిసిన మరుసటి రోజు నుంచే విజయసాయిని ఎలా అడ్డుకోవాలా అని చంద్రబాబు వ్యుహాలు రచించారు. విజయసాయిరెడ్డి ఎలాగైనా పార్లమెంటులో అడుగు పెట్టకుండా చేయాలని ప్రైవేటు సంభాషణల్లో పార్టీ నాయకులకు ఆదేశాలిచ్చారు. అందుకే ఈ వలసలను అంతగా ప్రోత్సహించారు. 

కానీ చంద్రబాబు ఊహించినంత ఫాస్ట్ గా వలసల వ్యవహారం సాగలేదు. వైసీపీ నుంచి దాదాపు 30 మంది వరకూ తమ పార్టీలోకి లాగుతామని   టీడీపీ నేతలు బాబుకు భరోసా ఇచ్చారు. కానీ ఆ టార్గెట్ రీచ్ కావడంలో ఫెయిల్ అయ్యారు. ఈ లోపు టీడీపీ వ్యూహం గమనించిన జగన్ కూడా జాగ్రత్త పడ్డారు. ఎమ్మెల్యేలు చేజారకుండా జాగ్ర్తత్త పడ్డారు. మొత్తానికి విజయసాయిరెడ్డిని పార్లమెంటు మెట్లు ఎక్కనీయకుండా బాబు అడ్డుకోలేకపోయారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: