హైదరాబాద్ తానే కట్టించానని చెప్పుకోవడంలో ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పుడూ ముందే ఉంటారు. ఆయన కాస్త ఎక్కువ చెప్పుకున్నా.. చంద్రబాబు వల్ల హైదరాబాద్ అభివృద్ధి వేగం పెరిగిందనేది కాదనలేని సత్యం. కాకపోతే.. చంద్రబాబు చేసినదాని కన్నా ఎక్కువ, పదే పదే చెప్పుకోవడంతో అది కాస్తా కామెడీ అవుతుంది. ఓవర్ డోస్ ప్రచారం వల్లే అనర్థం జరుగుతోంది. 

తాజాగా చంద్రబాబు మైక్రోసాప్ట్ సిఇఓ సత్య నాదెళ్ల విషయంలో పచ్చి అబద్దాలు ప్రచారం చేసుకుంటున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. నవనిర్మాణ దీక్ష సందర్బంగా చంద్రబాబు ప్రసంగిస్తూ..  మైక్రోసాప్ట్ సిఇఓ సత్య నాదెళ్ల తనవల్లే స్పూర్తి పొందారని ప్రచారం చేసుకున్నారు. ఐతే.. సత్య నాదెళ్ల 1992లోనే మైక్రోసాఫ్ట్ లో జాయిన్ అయ్యారని ,చంద్రబాబు ముఖ్యమంత్రి అయింది 1995లో నని డోన్ వైసిపి ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్ర నాద్ రెడ్డి బయటపెట్టారు. 

సత్య నాదెళ్ల విషయంలో బాబు బొంకారా..!?



చంద్రబాబు ఉపన్యాసం చూసిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సత్యనాదెళ్ల గురించి మొత్తం వివరాలు సేకరించారు. దాంతో బాబు బొంకారన్న నిర్దారణకు వచ్చారు. ఇక ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయంపై చంద్రబాబును కడిగేశారు. సత్య తండ్రి యుగందర్ 1986-88 లో ఎపిలో పనిచేశారని, చంద్రబాబు ఆ తర్వాత తొమ్మిదేళ్లకుగాని ముఖ్యమంత్రి కాలేదని, మరి అలాంటప్పుడు యుగందర్ ఈయన వద్ద ఎప్పుడు పనిచేశారో చెప్పాలని రాజేంద్రనాథ్ డిమాండ్ చేశారు. 

సత్య నాదెళ్ల కూడా ఎప్పుడూ చంద్రబాబు వల్ల స్పూర్తి పొందానని అనలేదని రాజేంద్రనాథ్ గుర్తు చేశారు. బాబు అంత స్పూర్తి ప్రదాతే అయితే తన కుమారుడు లోకేష్ ను ఎందుకు ఇన్ స్పర్ చేయలేకపోయారని బుగ్గన సెటైర్ వేశారు. అబద్దాలు ప్రచారం చేసినందుకు సత్య నాదెళ్లకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని బుగ్గన డిమాండ్ చేశారు. సత్య నాదెళ్ల 1992లోనే మైక్రోసాఫ్ట్ లో జాయిన్ అయితే.. సత్య నాదెళ్ల తనవల్లే ఐటి చదివారని చెప్పుకోవడం ఆలోచించాల్సిన విషయమే.



మరింత సమాచారం తెలుసుకోండి: