ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఘన విజయం సాధించిన విషయం అందరికీ విదితమే. జాతీయ సర్వేల అంచనాలను తలక్రిందులు చేస్తూ అమ్మ విజయం సాధించి తమిళనాడు రాజకీయ చరిత్రను తిరగ రాసింది. అయితే ఒకానొక సమయంలో అమ్మ అధికారం ఈ సారి కష్టమే అనే అభిప్రాయం వెలువడిన సందర్భంలో అమ్మ పట్ల కొందరు విముఖతను వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతేకాక, అమ్మ మనసులో ఒక వేల విజయం సాధిస్తే వీరి పట్ల కఠిన వైఖరిని అవలంభించాలని నిర్ణయం తీసుకుందో ఏమో , అధికారంలోకి రాగానే వారిపై వేటు వేసింది.   


మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించలేకపోయిన మాజీ మంత్రులు, పార్టీ నేతలపై అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కొరడా ఝుళిపించారు. మొన్నటిదాకా విద్యుత్ శాఖ మంత్రిగా కొనసాగిన నాథమ్ ఆర్ విశ్వనాథన్ దిండిగల్ పార్టీ కార్యదర్శి పదవిని కోల్పోయారు. ఇక పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఉన్న మాజీ మంత్రులు పొన్నయన్, పళనియప్పన్, పర్నుతి రామచంద్రన్, మోహన్ లను ఆ పదవుల నుంచి జయ తప్పించారు. ఇక తన నమ్మిన బంటు పన్నీర్ సెల్వం కుటుంబ ఆధిపత్యానికి చెక్ పెట్టిన జయలలిత ఆయన కుమారుడు రవీంద్రనాథ్ ను కూడా తేని జిల్లా కార్యదర్శి పదవి నుంచి తప్పించారు.


తమిళనాట రాజకీయాల్లో తనదైన ముద్రను వేసుకుంటూ పాలన కొనసాగిస్తున్న జయలలిత ఆపార రాజకీయ అనుభవాన్ని గడించారు. ఇంతటి రాజకీయ చతురత కలిగిన జయమ్మకు ఎప్పుడూ ఎక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఆలోచించడంలో అమ్మ దిట్ట. అదను చూసి మాటు వేయడంలో, రాజకీయ దెబ్బ తీయడంలో అమ్మకు సాటి రారు మరెవ్వరు....!


మరింత సమాచారం తెలుసుకోండి: