అమరావతి ని విద్యా కొలువు గా చెయ్యడం కోసం సర్వం సిద్దం చేస్తున్నారు. అమరావతి లో అమృత , విట్ , ఎన్ ఆర్ ఏం , ఎమిటీ వంటి ప్రముఖ యూనివర్సిటీ క్యాంపస్ లు రాబోతున్నాయి. తమ క్యాంపస్ కి భూములు ఇవ్వాల్సింది గా ఇప్పటికే కొన్ని యూనివర్సిటీ లు ప్రభుత్వాన్ని కోరగా మిగితావి ప్రాసెస్ లో ఉన్నాయి. ఒక్కొక్క యూనివర్సిటీ కీ నూట అయిదు ఎకరాలు ఇస్తారు. కేటాయించడం ఎప్పుడు పూర్తి అవుతుందో అప్పుడే వెంటనే తమ పని మొదలు పెడతాం అని వారు తేల్చి చెప్పేశారు.

 

ప్రభుత్వం మాత్రం ఐదారు వేల మంది విద్యార్ధులని చేర్చుకోవడం కోసం ఆలోచించాలి అని వారికి సూచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గాదర్సకాలని లెక్కలోకి తీసుకుని వారి వారి భూ భాగం నిర్ణయిస్తారు. దక్షిణ భారత దేశం లో ముఖ్యంగా తమిళ్ నాడు లాంటి ప్రాంతం లో ఉండే యూనివర్సిటీ లు అమరావతి కి రావడం వలన అభివృద్ధి బాగా వేగవంతo అవుతుంది అని అంటున్నారు. విజయవాడ ప్రాంతం లో ఉండే విద్యార్ధినీ విద్యార్ధులు ఈ ప్రాంతం లో చదువుకోవడం కోసం ఆసక్తి చూపించే చాన్స్ ఉంది. ఇవి కాకుండా రెండు భారీ ఆసుపత్రులు కూడా భూమీ ఇమ్మని కోరుతూ ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరగా దానికి ప్రభుత్వం అంగీకరించింది.

ఇండో యూకే గ్రూప్ వెయ్యి పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తాం అని దానికి అమరావతి సరైన ప్రాంతం అని తెలిపింది. కర్ణాటక కి చెందిన బీ ఆర్ శెట్టి గ్రూప్ కూడా అమరావతి మెడిసిటీ పేరు తో వెయ్యి పడకల ఆసుపత్రి ఏర్పాటు చెయ్యడం కోసం నిర్ణయం తీసుకుంది. రెండు గ్రూపులూ తలా నూట యాభై ఎకరాలు కోరినా వంద ఎకరాలు ఇవ్వగలదు ప్రభుత్వం. ఇవి కాకుండా బసవతారకం ఆసుపత్రి కోసం పాతిక ఎకరాలు ఇవ్వాల్సి ఉంది. అయితే మంత్రి వర్గ సమావేశం లో వీటి అన్నిటికీ ఆమోద ముద్ర రాలేదు. టీటీడీ అమరావతి లో ఆలయ నిర్మాణం చెయ్యాలి అంటూ 49 ఎకరాలు కోరింది ఈ ప్రతిపాదనలు అన్నీ ప్రభుత్వం ఓకే చెయ్యాల్సి ఉంది. సర్వీస్ అపార్ట్మెంట్ ల కోసం పాతిక ఎకరాల భూమి కోరింది ఒక ప్రైవేట్ సంస్థ .


మరింత సమాచారం తెలుసుకోండి: