శుభవార్త , శుభవార్త .. ఒక్క రూపాయికే ఇడ్లీ , ఒక్క రూపాయి కే పెరుగు అన్నం , మూడు రూపాయలకే సాంబార్ అన్నం .. రూపాయి కే టీ , మూడు రూపాయిలకి దోస . ఇదీ అక్కడ తమిళ ప్రజల కోసం అక్కడి ప్రభుత్వం తాజాగా ఏర్పాటు చేసిన పథకం. నిత్యావసర ధరల విషయం లో సామాన్యులకి అల్పాహారం అందిస్తూ అమ్మా క్యాంటీన్ లు తమిళనాట సూపర్ హిట్ గా నిలిచాయి.

 

ఇదే రకం  క్యాంటీన్ లు ఏర్పాటు చేసే దిశగా తమిళనాడు లోని విశేషాలని ఇక్కడ అడాప్ట్ చేసే విధంగా చంద్రబాబు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. మొదటగా నవ్యాంధ్ర రాజధాని ప్రాంతాలు అయిన వెలగపూడి , తుళ్ళూరు , నవులూరు ప్రాంతాల్లో మొదట ఈ క్యాంటీన్ లు ఏర్పాటు చేసి వాటికి " అన్న క్యాంటీన్ " లు అనే పేరు పెట్టాలి అని చూస్తున్నారు.ఈ  అన్న క్యాంటీన్ లలో రోజుకి ఐదొందల మంది వరకూ అల్పాహారం ఏర్పాటు చేస్తున్నారు .. అల్పాహారం మొదట పెట్టి రెండు వారాల తరవాత భోజనం ముఖ్య లక్ష్యంగా ఏర్పాటు చేయ్యబోతున్నారు.

 

 అప్పట్లో తమిళనాడు వెళ్ళిన ఆంధ్ర ప్రదేశ్ మంత్రి వర్యులు పరిటాల సునీత, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు ఇవి ఇక్కడ ఏర్పాటు చేస్తే చాలా బెనిఫిట్ గా ఉంటుంది అని తెలిపారు అనే వారి ప్రతిపాదనలు చూసిన తరవాత ఇక్కడ ఏర్పాటు చెయ్యాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని చంద్రబాబు తెలిపారు. ఈ క్యాంటీన్లలో 1 రూపాయికే ఇడ్లీ, 3 రూపాయలకే పెరుగన్నం, 5 రూపాయలకే పులిహోరాను అందజేయబోతున్నారు . మొదట అక్కడ మొదలు పెట్టి దశల వారీగా రాష్ట్రం మొత్తం వీటిని స్థాపిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: