తమిళనాడు సీఎం జయలలిత ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. పేద ప్రజలకు ఎన్నో రకాల పథకాలు తీసుకు వచ్చింది..అందుకు ఆమెను రెండవ సారి ఘనవిజయాన్ని కట్టబెట్టారు తమిళ ప్రజలు. తాజాగా ఓ చైన్ స్నాచర్ల దొంగల దాడిలో తన ప్రాణాలు కోల్పోయిన హెడ్ కానిస్టేబుల్ విషయం తెలియగానే వెంటనే స్పందించారు. మునుస్వామి మృతికి అనంతరం ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని కుమార్తె రక్షణ చదువుకయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.

వివరాల్లోకి వెళితే..ఈ నెల 15వ తేదీన చైన్ స్నాచర్లు నగలు దోచుకెళ్తుండగా వారిని వెంబడించి ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ మున్నుస్వామి, మరో కానిస్టేబుల్ ధనపాల్ ఆ దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నించారట..కానీ ఉన్నట్టుండి ఆ దొంగలు మారణాయుధాలతో వీరిపై ఎటాక్ చేయగా ఎస్.ఐ. మరో కానిస్టేబుల్ కి గాయాలు కాగా మునుస్వామికి తీవ్రగాయాలు అయ్యాయట. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మున్నుస్వామి మరణించాడు.

మునుస్వామి మరణం సమయంలో తమిళనాడు సర్కారు ఐదు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటిచింది. తర్వాత అమ్మ ఉదారత చాటుకున్నారు..మునుస్వామి కుటుంబానికి కోటి రూపాయల పరిహారాన్ని అందజేస్తుందని ప్రకటించారు. ఇక నుంచి ఏ పోలీసు సిబ్బంది అయినా విధులు నిర్వహిస్తూ మరణిస్తే వారికీ రూ.కోటి పరిహారం ఇవ్వనున్నట్లు కొత్త ఆదేశాలు జారీ చేస్తామని జయమ్మ తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: