అమరావతి నిర్మాణ పనుల్లో ఆదినుంచి ఎన్నో సమస్యలు ఎదురవుతూనే వస్తున్నాయి. ఇంతకుముందు నిర్మాణ పనుల్లో ప్రమాదం జరిగి ఇతర రాష్ట్రానికి చెందిన కార్మికుడు మృతిచెందడం జరిగింది. ప్రస్తుతం సచివాలయం కొంత మేర భూమిలో కుంగిపోవడం జరిగింది. ఇలా ఒక దాని తర్వాత ఒకటి అమరావతిని చుట్టుముడుతున్నాయి. ఆయినే సరే అమరావతి ని అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని బాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 



రుతుపవనాల కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో మట్టి బాగా నానిపోవడంతో వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ భవంతి వద్ద నేల మూడు అడుగుల మేరకు కుంగింది. దీంతో రెండు బ్లాకుల్లో ఫ్లోరింగ్ దెబ్బతినగా, నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మంత్రులకు, ముఖ్య కార్యదర్శులకు కేటాయిస్తున్న బ్లాకు కుంగింది. దీంతో అక్కడి పనిచేస్తున్న వారు ఆందోళనకు గురయ్యారు. లూజ్ సాయిల్ వల్లే నేల కుంగివుండొచ్చని అనుమానిస్తున్నారు. దీంతో పనులు ఏ విధంగా కొనసాగించాలన్న విషయమై అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించి, సమాలోచనలు చేస్తున్నారు. నేల కుంగిన విషయమై మరింత సమాచారం వెలువడాల్సి వుంది. 



ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు హైదరాబాద్ వదిలి జూన్ 27కల్లా వెలగపూడికి తరలి రావాల్సిందేనని చంద్రబాబు ఆదేశించడంతో తాత్కాలిక సచివాలయం పనులు హడావుడిగా చేస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. తమకు కొంత సమయం కావాలని ఉద్యోగులు కోరినా చంద్రబాబు ససేమిరా అంటున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉద్యోగులు వచ్చి తీరాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జూన్ నెలాఖరుకు తాత్కాలిక సచివాలయం పనులు పూర్తి చేయాలని భావించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: