ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ నుండి విడిపోయిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ నేటి వరకు ప్రజా సమస్యలపై అలుపెరుగని కృషి చేస్తూనే వస్తున్నారు. తెలంగాణ నుండి ఉన్నపలంగా విడగొట్టి రాజధానిని సైతం కోల్పోయిన రాష్ట్రాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించి ఆదుకోవాలని అను నిత్యం కేంద్రం తో సంప్రదింపులు జరుపుతూ ప్రజా సమస్యలే పరమావధిగా పోరాడుతున్న జగన్ ఆ తర్వాత కాపులను బీసీ జాబితాలో చేర్చి వారికి బంగారు భవిష్యత్తును సొంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరడంతో అందుకు ప్రభుత్వం సరేమిరా అనడంతో ఉన్న పళంగా ముద్రగడను దీక్షకు దింపారు జగన్. 


అయితే ఈ సమస్యలను అన్నింటినీ పరిష్కరించడంలో బిజీ గ ఉన్న జగన్ తన రాజకీయ జీవితానికి కాస్త విరామం ప్రకటిద్దామని భావించిన జగన్ అతన కుటుంబ సభ్యులతో కలిసి బ్రిటన్ టూర్ కి పయనమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన అక్కడ గోల్ఫ్ ఆడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జూన్ 16వ తేదీ గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో సహా బయల్దేరి ఇంగ్లండ్ వెళ్లిన ఆయన.. మొత్తం 10 రోజుల పాటు విదేశీ పర్యటనలో ఉంటారని ఇంతకుముందు పార్టీ వర్గాలు తెలిపాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: