ఆంధ్ర ప్రదేశ్ సర్కారు కృష్ణా పుష్కరాల ఏర్పాటు ని చాలా సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి తమ సత్తాని దేశానికి చాటాలని చూస్తోంది . ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పుష్కర ఏర్పాట్ల మీద ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఇంకా నెలరోజుల వ్యవధి మాత్రమే ఉండడం తో ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూడాలి అని కోరారు ఆయన.


ఇదివరకు గోదావరి పుష్కరాల సమయం లో తొక్కిసలాట కారణంగా జరిగిన భాగోతాలు ఇక మీదట జరగకూడదు అనీ అలాంటి పరిస్థితి రాకుండా అప్పటి నమూనాలు తీసుకుని మరీ ఇప్పుడు ఘాట్ లని రూపొందించాలి అని చంద్రబాబు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసారు. ప్రజలంతా భాగస్వాములు అయ్యేలా ఈ పుష్కరాలు జరగాలి అని ఆయన కోరారు. ప్రజా ప్రతినిధులు కౌన్సిలర్ ల దగ్గర నుంచీ ఎమ్మెల్యే ల వరకూ అందరినీ అనుసంధానం చేసుకుంటూ వెళ్లాలన్నారు. " ప్రతీ ప్రజా ప్రతినిధీ తమ ప్రాంతం లో పరిధిలో ఉన్న ప్రతీ ఏర్పాటు నీ జాగ్రత్తగా సమీక్షించాలి , అది మన బాధ్యత తేడా వస్తే డైరెక్ట్ గా నాదగ్గర కి వచ్చి చెప్పండి పరవాలేదు. నిర్లక్ష్యం వహిస్తే ఏ అధికారినీ వదిలిపెట్టను , ఈ సారి ఒక్క చిన్న అవకతవక జరిగినా ఊరుకునేది లేదు " అని వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.

 

" కోటి మొక్కలు నాటుదాం "  :

 

దీనికి ముందర మొక్కల పెంపకం మీద సమీక్ష నిర్వహించిన బాబు జూలై నెల లో కోటి మొక్కలు నాటే కార్యక్రమం మొదలు పెట్టాము అనీ ఎదో ప్రభుత్వం నాటుకోవడం కోసం ఇది కాదు అనీ ప్రజలు అందరూ ఖచ్చితంగా ఇందులో భాగస్వాములు అవ్వాలి అనీ , ప్రజల వరకూ తీసుకుని వెళ్ళే బాధ్యత అధికారులధీ - ఎమ్మెల్యే లదీ అని చెప్పుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా లభించే అన్ని మొక్కల్నీ ప్రత్యేకంగా తెప్పించి మరీ నాటబోతున్నట్టు ప్రకటించారు ముఖ్యమంత్రి. స్కూళ్ళ దగ్గర నుంచి కలుపుకుని , కాలేజీ లూ, ప్రభుత్వ - ప్రైవేటు హాస్టళ్ళు ఇలా అందరు విద్యార్ధుల నీ ఏకం చేసుకుంటూ ఈ కార్యక్రమం సాగాలి అని ఆయన కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: