కెసిఆర్ అధికారం లోకి వచ్చిన తరవాత ప్రజల శ్రేయస్సు కోసం తీసుకునే నిర్ణయాలు తెలంగాణా రాష్ట్రానికి బాగా ఉపయోగకరంగా కనిపిస్తున్నాయి. విద్యుత్ పంపిణీ సంస్థ లని నష్టాల లోంచి బయటపడేసే ప్లాన్ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన ' ఉదయ్ ' పథకం లో తెలంగాణా కూడా భాగస్వామి అవుతుంది అని కెసిఆర్ ప్రకటించడం విశేషం.

 

డిస్కం ల అప్పులు తీర్చడం కోసం వారి మీద ఉన్న ఆర్ధిక భారాన్ని నెమ్మది నెమ్మదిగా తాము తగ్గిస్తున్నాం అనీ ఇలా చెయ్యడం కోసం నిధులు సమకూరే విధంగా ఎఫ్ఆర్బీఏం మినహాయింపులు ఇవ్వడం ఉపయోగపడే విషయం అని కెసిఆర్ అన్నారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ని స్వయంగా కలిసిన కెసిఆర్ ఉదయ్ పథకం లో తనని చేరమని మంత్రి కోరినట్టు తాను ఓకే చెప్పినట్టు చెప్పుకొచ్చారు. దీన్‌దయాళ్ పథకంలో ఎక్కువ నిధులివ్వడంతో పాటు తెలంగాణ విద్యుదుత్పత్తి ప్లాంట్లకు అవసరమైన బొగ్గును కేటాయించడానికి కూడా గోయల్ అంగీకరించారు. ఉదయ్‌లో చేరాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర అధికారులు మళ్లీ సమావేశమై ఒప్పందంపై సంతకాలు చేయాలని కేసీఆర్ కోరారు.

 

ఈ మీటింగ్ లో ఎల్యీడీ బల్బుల వాడకం గురించి కూడా కెసిఆర్ - మంత్రి ల మధ్య చర్చ జరిగింది. తెలంగాణా లో దాదాపు 26 నగర పంచాయతీ లూ, 12 మున్సిపాలిటీ లూ ఉండడం తో అన్నింటా ఇప్పటికే ఎల్యీడీ బల్బ్లు వాడుతున్నారు. వీటి వలన విద్యుత్ వాడకం బాగా తగ్గుతూ ఉంది. ఇప్పుడు ఇంటింటికీ ఎల్యీడీ బల్బులు ఉండేలా ప్రోత్సాహం చేస్తాం అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. బల్బుల ధర కూడా త్వరలో బాగా తగ్గబోతూ ఉండగా అధికారుల తో ఒప్పందాలు కుదుర్చుకుంటే బెనిఫిట్ ఉంటుంది అని కోరారు కెసిఆర్.

 

పంపు సెట్ లు మార్చాలి ..

 

తెలంగాణా లో ఇప్పటికే 22 లక్షల పంపుసెట్ లు ఉండగా వీటికే ఎక్కువ కరంట్ అవుతోంది అనీ తక్కువ కరంట్ ని లాగేవీ , ఇంట్లోంచే వాడుకునే పంపుసెట్ లు వచ్చాయి అనీ వాటిని వాడాలి అని మంత్రి సూచించారు. పంపుసెట్ లు మార్చుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలమీద అవగాహన తీసుకుని వస్తే తాము కేంద్రం తరఫున సహాయం చేస్తాం అని చెప్పారు మంత్రి. విద్యుత్ వాడకందారులు ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వపరంగా సహకరించాలని ఇరువురూ నిర్ణయించారు. వినియోగదారులు రోజూవారీగా తామెంత కరెంటు వాడిందీ తెలుసుకునేలా యాప్‌లు రూపొందిస్తామని కేసీఆర్ వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: