అంతా నా ఇష్టం..ఏం చేసినా..  అడిగేదెవడ్రా నా ఇష్టం.. అంటున్నా ఓ ప్రజాప్రతినిధి. ఎంతో బాధ్యతాయుతంగా పది మందికి ఆదర్శంగా నిలవాల్సిన ఓ మంత్రి గారు లుంగి డ్యాన్స్ పై లుంగీ విప్పి మరీ డ్యాన్స్ చేశాడు..ఇది కాస్త వైరల్ గా మరి సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తుంది. వివరాల్లోకి వెళితే..ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ నేత, ఆ రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి మహమ్మద్ ఫారుఖ్ హసన్ లుంగి డ్యాన్స్ చేస్తుండగా ఓ అజ్ఞాత వ్యక్తి దాన్ని షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మంత్రి ఒళ్లు మరచిపోయి డాన్స్ చేసినప్పటి ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వైరల్ అయ్యింది.

అయితే ఈయన గారు ఆ డ్యాన్స్ చేసిన ప్రదేశం ఎక్కడో సరిగా తెలియకపోయినా మంత్రి పదవిలో ఉండి  డ్యాన్స్ చేస్తే తప్పేముంది అనుకుంటున్నారా... లుంగీతో ఆడితే ఫర్లేదు కానీ తను కట్టుకున్న లుంగీ విప్పేసీ మరీ లుంగీ డ్యాన్స్ చేశాడు. మంత్రిగారి డ్యాన్స్‌ని ఆపాల్సిందిపోయి.... అక్కడున్నవారు చప్పట్లు కొడుతూ ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారు.డాన్స్ చేస్తూ మధ్యలో సోఫాలో పడిపోయిన మంత్రి.. లేచి లుంగీ విప్పేసి మళ్లీ కట్టుకుని స్టెప్పులేశారు. ఈ వీడియో బయటకురావడంతో ఆయనపై  తీవ్ర విమర్శలు వచ్చాయి.

మంత్రి గతంలోనూ ఇలా అసభ్యకరరీతిలో డాన్స్ చేసినట్టు స్థానికులు తెలిపారు. మరో వైపు అయితే మంత్రి హసన్ మాత్రం ఇది తనపై జరిగిన కుట్ర అని చెబుతున్నారు. దీనివెనుక పంచ్లీ ప్రాంతానికి చెందిన కొందరు యువకుల హస్తముందని ఆరోపించారు. వాళ్లు తనను బ్లాక్ మెయిల్ చేసి, డబ్బులు డిమాండ్ చేశారని చెప్పారు. మరి ఇది ఎంతవరకు నిజమో వేచి చూడాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: