“తాడిని తన్నే వాడుంటే,  వాడి తలదన్నే వాడు ఏప్పుడూ ఉంటూవుంటాడు”  నిరవదికంగా 50 పైగా  ప్రపంచ దేశాలను తమ అదీనము లోకి తెచ్చుకొని ‘రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని’  నిర్మించిన  ఇంగ్లండ్ స్వాతంత్రం కోసం అనేక దేశాలను శతాబ్ధాలకు పైగా వేదనకు గురిచేసి నరకయాతన చూపించిన ఇంగ్లాండ్ ఈ రోజు వరకు “స్వాతంత్రమో రామచంద్రా”  అంటూ గింజుకుని యురోపియన్ యునీయన్ (ఐరోపా సమాజం) నుండి  బయటబడి స్వాతంత్ర  సంబరాలు చేసుకుంటూంది నేడు.




28 దేశాల యురోపియన్ యూనియన్ కూటమిలో

 16.50% ఆర్ధికశక్తి యు.కె

సేవల రంగమే ప్రధాన ఆదాయ వనరులైన  ఈ కూటమిలో 50% సేవలు అందించేదీ యు.కే.

ఐక్యరాజ్య సమితిలో వీటో అధికారం యు.కే. కె ఉంది. 

ప్రపంచములో  5 వ అతి పెద్ద ప్రభల ఆర్ధిక వ్యవస్థ యు.కె. 

మరిలాంటప్పుడు కూటమి నుండి యు.కె ఎందుకు బయటకి రావాలని  కోరుకొంటుంది?




ఈయూ లో బ్రిటన్ ఉండాలా వద్దా అన్న గొడవ ముందు నుంచీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే బ్రిటన్ వాసులు “యూరో” ని కరెన్సీగా వ్యతిరేకించారు. గ్లోబలైజేషన్ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అదెంత తీవ్రంగా మారిందంటే, ఈయూ లో బ్రిటన్ కొనసాగాలని కోరుతున్న ఓ యంపిని, ఓ కుర్రాడు కాల్చి చంపేశాడు. విపరీతమైన వలసలు, సార్వభౌమాధికార మే ప్రశ్నార్థకంలో పడడం, బ్రస్సెల్స్ పెత్తనం పెరిగిపోవడంపై బ్రిటన్ వాసులు అసంతృప్తితో ఉన్నారు. అందుకే స్వతంత్రమే లేని బ్రిటన్‌కు ఈ రోజును స్వతంత్రమే దినోత్సవంలా అభివర్ణిస్తున్నారు.  యు.కె  ఒక కూటమిలో కొనసాగటానికే ఉక్కిరిబిక్కిరి అయింది. ఎక్కడికెళ్ళీనా వారి పెత్తనమే కొనసాగాలనే శతాబ్ధాల అహంకారం. అయితే కూటమిలో బ్రసెల్స్ బాగా తన ప్రభావం చూపటముతో యు.కే ఉక్కిరి బిక్కిరైంది. కూటమిలో ఉండే స్వల్ప మాత్రమైన సహకార బందములో కూడా ఇమడలేని విచిత్ర ప్రవృత్తి యుకే ది.  తమ వలసదేశాలై ఉండి స్వాతంత్రం పొందిన అమెరికా, ఆస్ట్రేలియా లాంటి అగ్ర రాజ్యాలకు కూడా లేని స్వాతంత్ర పిపాస, విసిష్ఠత, వైచిత్రి ఇంగ్లాండ్ వాసులకుంది. సగుణాత్మకమైన ప్రజాస్వామ్యా న్ని అనుభవించటంలో సాధించటములో వారి వైఖరి ప్రశ్నార్ధకమెన్నటికీ కాదు. వారి విలక్షనత ప్రజాస్వామ్య జీవనానికి పరాకాష్ఠ. వారికోసం వారు, వారిలో వారు ప్రజాస్వామ్య సాంప్రదాయాలను నిర్ద్వందముగా అనుసరిస్తారు. దీనిని వారి విదేశవ్యవహారాలకు ముడిపెట్టకుండా చూస్తే ప్రజాస్వామ్యాన్ని తనివితీరా అనుభవించే ఉచ్చదశను వారు చవి చూశారు. అవసరమైతే యుకె లోని ఏ ఇతర రాజ్యం ప్రజాభిప్రాయంతో కోరితే విడిపోవటానికి చలించని, తొణకని దశను సంతరించుకున్నందుకు వారిని అభినందించాలి. 




కూటమిలో కొనసాగాలా వద్దా అనే మీమాంస కూటమిలో చేరిన రోజునుండే స్వతహాగా సాంప్రదాయవాదులైన బ్రిటీష్ పౌరులకుండేది. ప్రపంచములోని తమ వలస పాలనలోని దేశాల ప్రజల రక్తం స్వేదం నుండి పిండుకొని తరలించిన వలస దేశాల సంపదతో కొవ్వెక్కిన యుకె.కి బలుపుకు వాపుకు తేడాతెలియని స్థితిలో కూటమి నుండి బయటకు వచ్చింది అదీ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా కూటమిలో కొనసాగాలా (48%)? వద్దా (58%)? 3% ఓట్ల ఆధిఖ్యతతో కూటమి నుండి బయటకు రావాలనే భావం తో నేడు యుకే కూటమి నుండి బయటకు వస్తుంది. అంటే ఈ నిర్ణయానికి వ్యతిరేఖత 48%. అంటే మరల కూటమిలో కొనసాగాలని లేదా చేరాలనే అభిప్రాయం మారటం మళ్ళా జరగవచ్చు. కాని అప్పటికి అసలు ఐరోపా కూటమే అంతరించవచ్చు. ఉండకపోవచ్చు. అసలు విడిపోవటం, విభజన అనేవే ప్రతికూల (నెగేటివ్) ఆలోచన. మొన్న స్కాట్లాండ్ మొన్న 2014 లో స్కాట్లాండ్,  యుకె నుండి విడిపోవటానికి ప్రజాభిప్రాయ సేకరణ జరిపి చివరకు కలిసి ఉండాలనే అనుకూల (పోసిటివ్) నిర్ణయం వోట్ల ఆధిఖ్యత తో తీసుకుంది. అలాగే బ్రిటీష్-ఐరిష్ కౌన్సిల్ లో ముందుకుసాగుతుంది. ఇక్కడ కూడా వారికి సాంప్రదాయవాదమే దారిచూపింది. అందుకే యుకె ప్రజలు సాంప్రదాయ ప్రియులు అని ఘట్టిగా చెప్పవచ్చు.



తన విధానానికి వ్యతిరెఖ వాదన గెలిచి తన వాదన తిరస్కరణకు గురవ్వటంతో యుకె ప్రధాని డేవిడ్ కేమరూన్ రాజీనామా చేయటానికి సిద్ధపడ్డారు. అంతే కాదు అక్టోబర్లో ఎన్నికలు జరిపి కొత్త ప్రధాని అధికారములోకి వస్తారని నిర్ద్వందంగా ప్రకటించారు. ఇక్కడ మరో అలోచన కాదుకదా షార్ట్-కట్ కూడా లేదు. అదీ సాంప్రదాయవాదమంటే. అందుకే యుకె కి లిఖిత రాజ్యాంగమే లేదు. కారణం ప్రజాభిప్రాయాలు, సాంప్రదాయంగా తీసుకుంటున్న నిర్ణయాలే మూలాలు గా కొనసాగే వ్యవస్థ యుకె ది.   



సమీపభవిష్యత్లో ఐరోపా కూటమినుండి మరికొన్ని దేశాలు ఎక్జిట్ (బయతకు వచ్చే) అవకాశాలున్నాయి. బ్రిటన్ తను ఎక్జిట్ ఐ బ్రెక్జిట్ అయింది. అలాగే ఇంకొన్ని దేశాలు ఎక్జిట్ అవవచ్చు. వాళ్ళకు కలవటం విడిపోవటం సహజలక్షనం. ఆర్ధిక ఫలితాలవైపు చూసే సమాజం కాదది. అవి అనేక దేశాలను తమపై ఆధార పడేలా చేసుకున్న స్వయం - సమృద్ధ - దేశాలు. వనరులు లేకున్నా వనరులను తమవద్దకు రప్పించుకోగల ప్రణాళిక రచించుకున్న వ్యవస్థలవి. మనకు లేనిది ప్లానింగ్ అంటే ప్రణాళిక. అందుకే బ్రెక్జిట్ గెలిస్తే మన రూపీ విలువ ధమాల్, బులియన్ విలువ జంపప్, షేర్-మార్కెట్ బేర్. 70 సంవత్సరాల స్వాతంత్రం తరవాత కూడా మనం నేర్చుకోలేనిది మార్పుకు సిద్ధపడని కనీస నియంత్రణ కొరవైన ప్రణాళిక లేని ఆర్ధిక విధానం.



స్కాట్లండ్ ఇప్పటికే యుకె నుండి విడిపోవాలను కుంటుంది. దాని ఆశయం యురోపియన్ యూనియన్లో ఉండాలని, ఈ రెండు అంశాలు అక్కడ ప్రాదమ్యం సంతరించుకుంటే ఇలాంటిపరిస్థితే వేల్స్, ఐర్లాండ్లో వస్తే అవివిడిపోవటం తథ్యం. అదే జరిగితే యుకె నాలుగు దేశాలుగా విడిపోవచ్చు. భారత్ తో కలిపి కామన్వెల్త్ దేశాలన్నీ యుకె నిర్ణయాన్ని మార్చుకోమని నిజ్ఞప్తి చేసాయి. మనలా కాకుండా పక్కా ప్రజాస్వామ్య దేశమైన యుకె ప్రజాభిప్రాయానికే మొగ్గుచూపింది. అదే మనదేశములో నైతే అనేక వంకరటింకర వేషాలు వేసి ప్రధానికి నచ్చిందే ప్రజాభిప్రాయం అంటారు. ఉదాహరణకు అమరావతి నిర్మాణం. ప్రజలకు ఇష్టంలేని, ప్రభుత్వపెద్దలకు పాడి ఆవు. విదేశాలకు మన భూమిని 99 యేళ్ళు లీజుకిచ్చే తంతు, మహామాయ అంటారు చాలామంది. అక్కడ ప్రకృతి బహుళ అంతస్తుల భవనాలకు యోగ్యం కాదని చెప్పుతున్నా ప్రజాభిప్రాయాన్ని మన్నించని కనీసం తెలుసుకోని ప్రభుత్వం పాలిస్తుంది. దీన్ని యుకె లాగా ప్రజాస్వామ్యం అనగలమా? అక్కడ ప్రతిపక్షం కూడా బలంగానే ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం సామ దాన భేద దండోపయాలతో బలహీనం చేసి మరీ ప్రతిపక్షాన్ని చంపి పాలన చేస్తున్నా ఏమీ చేయలేని చావ చచ్చిన ప్రజలం మనం. నిజమైన ప్రజాస్వామ్యానికి యుకె, కుహానా ప్రజాస్వామ్యానికి భారత్ ను ఉదాహరణగా చెప్పొచ్చు. 

యుకె వాయవ్య ఐరొపాలోని ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ మరియు ఉత్తర ఐర్లాండ్ దేశాలతో కూడిన ద్వీప రాజ్యం (ఐలాండ్ నేషన్) విలియం షేక్స్పియర్ మరియు బీటిల్స్ లాంటి మేధావులకు కు జన్మభూమైన లండన్ దీని కాపిటల్. 1707 లో ఒక ప్రజాస్వామ్య రాజ్యంగా ప్రకటించుకొని చివరకు అనేక చట్టాలతో ప్రక్క రాజ్యాలతో యునైటెడ్ కింగ్-డం గా ఏర్పాటై తన పాలనలో ఉన్న దేశాల్లో ఎక్కడో అక్కడ ఎల్లవేళలా రవిప్రకాశించేలా 52 దేశాలలో వలస రాజ్యాలను తమ వ్యాపారాభివృద్ధితో పాలన మిళితం చేసుకొని విశ్వవ్యాపితమైంది. ఈ వ్యాప్తిలో అనేక సంస్కృతులు, అచార వ్యవహారాలు, ఆహార అలవాట్లు, భాషా సహిత్యాలను తనలో కలిపేసుకొని ఒక మార్పుకు, ఉపద్రవానికి, పెను ప్రమాదానికి, ఆర్ధిక సంక్లిష్టతకు చలించని, బెదరని దేశం గా కంటే వ్యవస్థగా రూపుదిద్దుకుంది. అందుకే తన ప్రజల కిష్టమైన బ్రెక్జిట్ను, ఏకానమీ, వ్యాపారం కుప్పకూలుతున్నా బెదరక చెదరక నిర్ణయంలో తొట్రుపాటు లెకుండా ముందుకునడుస్తుంది. అక్కడ ప్రజా నిర్ణయం ప్రధానం. ప్రజానిర్ణయమే యునైటెడ్ కింగ్-డం విడిపోవాలని కోరితే నిస్సంశయంగా వారు ఏదేశానికి ఆదేశం విడిపోవడం క్షణాల్లో పని. ఇక్కడ వారి ప్రజలు వారి నిర్ణయం ప్రధానం. 2018 లో యుకె 28 దేశాల ఐరోపా సమాఖ్యకి గుడ్-బై చెప్పేయటం తో పాటు వారికి నచ్చని కన్-జర్వేటివ్ నాయకుడు డేవిడ్ కామెరూన్ కు రానున్న అక్టోబర్లోనే ఉద్వాసన చెప్పనుంది. అలాగే వారికి మాజీ లండన్ మేయర్ బోరిస్ జాన్సన్ కొత్త ప్రధానిగా రావచ్చు అని ఊహాగానాలు ఇప్పటికే వెలుగు చూస్తున్నాయి.  



బ్రెక్జిట్ కు మనం వణుకుతున్నాం, బెణుకుతున్నాం, చలిస్తున్నాం, జ్వలిస్తున్నాం కాని ఆ అగ్నిలో వాళ్ళు ఆనందం అనుభవిస్తున్నారంటే అదీ వ్యవస్థ నిర్మాణములోని పఠిష్ఠత. ప్రజలు ప్రభుత్వాలను శాసించే ఒక అద్భుత దశ. మన ఇండియాకు ఆరోజులు  వస్తాయా?

భారత చరిత్ర ఆషా మాషీ కాదు. ఇంగ్లాండ్ నాగరికత నేర్వనప్పుడే భారత్ ఐశ్వర్యాలతో తులతూగింది. 350 పైగా సుసంపన్న దేశాలు ఈ జంబూ-ద్వీపములో విలసిల్లాయి. కాని ఆ వైభవమంతా అనైఖ్యత, కుళ్ళు-కుతంత్రాల మయమైన రాజకీయాలతో అధమ స్థాయికి చేరుకొంది. అందుకే అమెరికాకు జలుబు చేస్తే ఇండియాకు తుమ్ము లొస్తాయి. ఇంగ్లాండ్ కు జ్వరమొస్తే ఇండియా కు చలి పుడుతుంది. చైనాకు మధుమేహమొస్తే ఇండియా సొమ్మ సిల్లుతుంది. అన్నిటికీ మూలం మన నియంత్రణలేని ప్రణాళికా రహిత పాలనలే. ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వని ప్రజా ప్రతినిధులే. ఏదెలా ఉన్నా స్వయం సమృద్ధి సాధించుకోవాలనీ, తనపై తాను నిలబడితేనే ప్రజాస్వామ్యం నిలబడు తుందనీ, కలిసిపోవటం, విడిపోవటం సర్వ సామాన్యమేననని అతి ముఖ్యమైనది ప్రజానిర్ణయాధికారమని, అది ప్రజా భిప్రాయంద్వానే తెలుసుకోవాలని బ్రెక్జిట్ చేపుతుంది. లేకుంటే ఎక్కడో సుదూర దేశం అదీ ఒక సమాఖ్య నుండి విడిపోతే మనమిక్కడ చడ్దీ తదుపుకోవటం ఒక బృహత్తర ప్రజాస్వామ్య దేశానికి తగునా?



ఏలాంటి సంకటాన్నైనా ఎదుర్కొనే విధంగా వ్యవస్థలను స్వపరిపాలనా క్రమంలో నిర్మించాలి. మేక్ ఇన్ ఇండియాని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అవినీతిని రూపుమాపి విజిలెన్స్ ను పెంచి థర్డ్ ఐ ని శక్తివంతం చేసు కోవాలి. వేగు వ్యవస్థని సాంకేతికంగా తీర్చిదిద్దాలి. ఒక్క చైనా, ఒక పాకిస్థాన్, ఒక స్విట్జెర్లాండ్  మనల్కు "ఎన్ ఎస్ జి" సభ్యత్వం దొరకకుండా నివారించగలిగాయి. మోడీ ఎంత కృషి చేసినా మన పూర్వ విదేశీ విధానాలు మనల్ని కట్టికుడుపు తున్నాయి.



భారత్ సాంకేతిక సామర్ధ్యానికి మచ్చుతునక ఇస్రో ప్రయోగాలు. నాయకత్వానికి మైక్రోసాఫ్ట్, గూగిల్ ఉదాహరణలు. మనకి లేనిదల్లా సరైన నాయకత్వం. మనమనుల్లో నిండిన పచ్చి బానిసత్వం. నాయకత్వ వైఫల్యం. ప్రజాప్రతినిధుల కెవరికి వారసత్వ, వ్యాపార, పారిశ్రామిక, విదేశీ, ఆర్ధిక ప్రత్యక్ష, పరోక్ష ప్రయోజనాలు ఉండకూడని నేరచరిత్ర అసలే ఉండరాదని స్పష్ఠమైన ఎన్నికల నిబందన విధిస్తే ఇప్పుడున్న ప్రజాప్రతినిధి ఒక్కడంతే ఒక్కడు కూడా నిలబడటం కష్టం. అదే ఇంగ్లాండులో నైతే ప్రజాప్రతినిధులు నేరాలను బట్టబయలు చేయటానికి ప్రభుత్వ, ప్రజా, ప్రైవేట్ వ్యవస్థలు వెనుకాడవు.


బోరిస్ జాన్సన్ 


మరింత సమాచారం తెలుసుకోండి: