ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని  ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీ రామారావు  జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇసుకను జిల్లాలు దాటించి రవాణా చేసే వాహనాల విషయంలో కఠినంగా ఉండాలని, క్రిమినల్‌ కేసులు పెట్టి వాహనాలు సీజ్‌ చేయాలన్నారు. స్థానిక అవసరా లకోసం మాత్రం దగ్గరలోని రీచల నుంచి ఇసుక లభించేలా చేసేందుకు కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇచ్చేలా చూస్తామన్నారు. శుక్రవారం ఆయ న.. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. స్థానికంగా ఇసుకను తీసుకెళ్లే ఎడ్లబండ్లు, అయితే ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా రవా ణాచేస్తే మాత్రం ఊరుకోబోమన్నారు. అక్రమ రవాణా నియంత్రనకు ప్రతిజిల్లాలో మొబైల్‌ స్క్వాడ్‌లను నియమించాలని, ఈ స్వ్కాడ్‌లతో కలిపి జిల్లా స్థాయి ఎనఫోర్స్‌మెంట్‌ సెల్‌ను ఏర్పాటుచేసి పర్యవేక్షించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇసుక డంప్‌లు ఏర్పాటుచేసిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలన్నారు.



ఓవర్ లోడింగ్ సమస్యను అరికట్టేలా నూతనంగా పదుల సంఖ్యలో వే బ్రిడ్జిలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఎక్కడెక్కడ వే బ్రిడ్జిలు అవసరమో వెంటనే గనుల శాఖ అధికారులకు తెలియజేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ వే బ్రిడ్జిలను సెంట్రల్ వెబ్ సైట్‌తో అనుసంధానం చేస్తామన్నారు. ప్రతి మైనింగ్ ఆస్తిని జియో ట్యాగ్, జియో ఫెన్సింగ్ చేయాలని ఆదేశించారు. రొబో శాండ్ ఉపయోగాన్ని పెంచాలన్నది తమ లక్ష్యంగా పేర్కొన్న మంత్రి, దాని ఉత్పత్తిని బలహీన వర్గాల యువతకు అప్పజెప్పేలా చర్యలు తీసుకోవాలన్నారు.



స్థానికంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు అవసరమయ్యే ఇసుక సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. పేద ప్రజలకు సౌకర్యంగా ఉండేలా, సామాన్యుడి సొంత ఇంటి కలకు సహకారం అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వ మైనింగ్ విధానం ఉండాలన్నారు. స్థానిక అవసరాల కోసం దగ్గరలోని ఇసుకరీచ్‌ల నుంచి ఇసుక లభించేలా చేసేందుకు జిల్లా కలెక్టర్లకే పూర్తి అధికారాలు ఇచ్చేలా చూస్తామన్నారు.



జిల్లాల్లోని ఇంజినీరింగ్ సిబ్బందితో రెగ్యులర్‌గా సమావేశాలు నిర్వహించుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. మైనింగ్ ఆక్రమార్కులు, మాఫియా అగడాలను పూర్తిగా అరికడతామని స్పష్టం చేశారు. గనుల ద్వారా ప్రభుత్వాదాయం పెరిగేలా చూడాలన్నారు. ఇప్పటికే మైనింగ్ ఆదాయంలో దక్షిణ భారతదేశంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు మంత్రి కేటీఆర్ పలు ఆదేశాలను జారీ చేశారు. ప్రతి జిల్లాలో మొబైల్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలన్నారు. ఈ మొబైల్ స్క్వాడ్లతో కలిసి జిల్లా స్థాయి ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ నెలకొల్పి పర్యవేక్షించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అక్రమంగా రవాణా చేసి స్థానికంగా ఇసుక డంప్‌లను ఏర్పాటు చేసేవారిపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: