బ్రిగ్జిట్ బ్లాస్ట్ ప్రపంచ మార్కెట్ ని నిలువునా ముంచేసింది. మదుపరులు ఎన్నో సంవత్సరాల పాటు దాచుకున్న డబ్బు అమాంతం నష్టపోయారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1.35కోట్ల కోట్లు గాలిలో కలిసిపోయాయి అని నిపుణులు చెబుతున్నారు. యూరోపియన్ యూనియన్ లో తాము ఉండము అంటే ఉండము అని తేల్చి చెప్పేసిన ప్రజల తీర్పు ప్రపంచ స్టాక్ మార్కెట్ ని తీవ్రంగా ఆడేసుకుంది .

 

తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి లో ఉన్న గ్లోబల్ ఈక్విటీ మార్కెట్ లు అన్నీ అతలాకుతలం అయిపోయాయి. పెట్టుబడి దారులు ఏళ్ళ తరబడి దాచుకున్న సొమ్ము ఒక్కసారి గా గాల్లో కలిసిపోయింది. భారత్ స్టాక్ మార్కెట్ లో కూడా బ్లాక్ ఫ్రైడే నమోదు అయ్యింది. మార్కెట్ పతనం ఒక దశ లో నాలుగు లక్షల కోట్లకి పైగా జారిపోగా  చివ్వరికి వచ్చే సరికి లక్షా డబ్భై ఎనిమిది కోట్ల దగ్గర ఆగింది. మొత్తం మీద 2.1 ట్రిలియన్ డాలర్ల సంపద తుడిచిపెట్టుకుని పోయింది అంటున్నారు. దీన్నే రూపాయల్లో మారిస్తే కోట్లు కోట్లకి పైగా అవుతుంది. ప్రపంచం ఆర్ధిక మాంద్యం అప్పుడు కూడా ఇంత దారుణమైన నష్టాలు చూడలేదు అని అంటున్నారు విశ్లేషకులు.

 

టోక్యో, పారిస్ మార్కెట్లు 8 శాతం, ఫ్రాంక్ ఫర్ట్ సుమారు ఏడు శాతం, లండన్, న్యూయార్క్ మార్కెట్లు మూడు శాతానికి పైగా నష్టపోయాయి. ట్రావెలింగ్ ని కూడా బాగా ఎఫ్ఫెక్ట్ చేసిన ఈ మార్కెట్ భారీగా విమానయాన షేర్ లు భారీగా పతనం అయ్యింది. ప్రస్తుతానికి 10 శాతం నష్టం తో 31 సంవత్సరాల తక్కువ ధర లో పౌండ్ ధర నడుస్తూ ఉండగా ఈ దారుణం ఇంకా పతనానికి దారి తీస్తోంది. జపాన్ మార్కెట్ ని పది నిమిషాల పాటు ట్రేడింగ్ కూడా ఆపేసే విధంగా ఈ ఆర్ధిక సునామీ విరుచుకు పడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: