ముంబాయిని గజ గజలాడించిన మోస్ట్ వాంటెడ్ మాఫియా లీడర్ దావుద్ ఇబ్రహీమ్ ఇంట విషాదం నెలకొంది.  1993లో ముంబైలో మారణ హోమం సృష్టించిన తర్వాత గుట్టు చప్పుడుకాకుండా దేశం విడిచి పరారైన దావూద్. అతని పై భారత దేశంలో ఎన్నో కేసులు ఉన్నాయి. ఆ మద్య దావూద్ ఇండియాకు వస్తే తనపై ఎలాంటి కేసులు ఉండకూండా చూడాలని కొన్ని ఆంక్షలు పెట్డడంతో భారత్ తిరస్కరించింది. అంతే కాదు ఆయనకు గత కొంత కాలంగా ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా విషమించినట్లు పూర్తిగా నడవలేని పరిస్థితికి చేరినట్లు కూడా వార్తలు వచ్చాయి.

తాజాగా ఆయన ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది..దావూద్ సోదరుడైన హుమాయున్ కస్కర్ (40) శుక్ర‌వారం క‌రాచీలోని అత‌ని నివాసంలో మ‌ర‌ణించాడు.  1993లో ముంబై నుంచి పరారైన దావూత్ పాకిస్థాన్ లోని కరాచీలో తల దాచుకున్నట్లు వార్తలు వచ్చాయి. అక్కడే ఆయన స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడే పాక్ గూఢచార సంస్థ ఐ.ఎస్.ఐ భద్రత నడుమ హాయిగా జీవనం సాగిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇక ముంబై పేలుళ్లతో హుమాయున్‌కి ఎటువంటి సంబంధాలు లేకున్నా కూడా కరాచీలోకి వెళ్లిపోయారు. అయితే ఆయనపై కూడా పలు నేరాలకు సంబంధించిన కేసులతో  కస్కర్ ఇండియా వాంటెండ్ లిస్ట్‌లో చేరిపోయాడు. ఈ క్రమంలో గత కొంతకాలం క్రితం కేన్సర్ సోకిన కస్కర్ కి మెరుగైన వైద్యం అందించినప్పటకి ఫలితం లేకపోవడంతో అకాలమరణం చెందాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: