యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకొస్తే ఫ్యూచర్ అంధకారమేనని ప్రధానమంత్రి, ప్రభుత్వ యంత్రాంగం, ఆర్థిక నిపుణులు, బ్యాంకులు, మిత్రదేశాలు, కామన్వెల్త్ దేశాలు హెచ్చరించినా ప్రజానిర్ణయాన్ని మాత్రం ఏమాత్రం మార్చలేక పోయాయి. చివరకు ప్రజలే గెలిచారు. కోరికక నెరవేరింది. ఈ ప్రజా నిర్ణయము వెనుక ఉన్న బలమైన కారణాలేంటి? ఎందుకు ప్రభుత్వ నిర్ణయాన్ని, మిత్ర సలహాలని అక్కడి ప్రజలు తిరస్కరించారు.


సమైఖ్య ఆంధ్ర ప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా విభజన ఫలితాల్ని ముందుగానే ఊహించినట్లు చెప్పిన పాఠాలన్నీ ఊహాజనితాలే నని ఋజువయ్యాయి. తెలంగాణా ప్రజలకొరిక మన్నించబడింది. కిరన్ కుమార్ రెడ్డి పెట్టిన భయాలు నిరూపితం కాలేదు. అలాగే ఈయు నుండి   యుకె  విడిపోయినా, తరవాత యుకె నుండి ఇర్లాంద్, ఇంగ్లాంద్, స్కాట్లాంద్, వేల్స్ విడిపోయినా మిన్ను విరిగి మీద పడదు వారికి.




 ప్రజలకు కావలసింది ఈయు తో విడాకులు దానినే వారు స్వాతంత్రం అంటున్నారు. పచ్చి బానిసత్వములో పరమాన్నం తిన్నా రుచించదు. అలాగే స్వతంత్ర వాయువులు పీలిస్తూ పచ్చడి మెతుకుల రుచి పరమాన్నం కంటే అద్భుతంగా ఉంటుందనేది యుకె ఫీలింగ్.  యుకె సభ్యదేశాలు కొన్ని ఇప్పటికే ఐరొపా సమాజములో కలిసే కొనసాగాలని కోరుకొంటూ బ్రెగ్జిట్ తరవాతి రోజునుండే మరో రెఫరెండం జరపాలని ఉవ్వెట్టున సంతకాల సేకరణ జరిపి లక్షల్లో సంతకాలు చేశారు. ఒక లక్షకు మించి అభ్యర్ధన ఉంటే చాలు రెఫెరెండం జరపాలనేది అక్కడి సాంప్రదాయం. అంతే కాదు ఈ రెఫరెండం లో 70% ప్రజలు మాత్రమే పాల్గొన్నరని అందులో బ్రెగ్జిట్ అనుకూల నిర్ణయంలో పూర్తి ప్రజాభిప్రాయం వ్యక్తం కాలేదని ప్రశ్నిస్తున్నారు.


మరో రెఫరెండం జరపటానికి ప్రభుత్వం సముఖంగా ఉన్నా, ఈయు దీనిద్వారా వెల్లడయ్యే ఫలితాన్ని అంగీకరించకపోవచ్చు. అందుకే యుకె బ్రెగ్జిట్ అలోచన నచ్చని స్కాట్లాండ్, వేల్స్ లాంటి దేశాలు వెంటనే విడిపోయి ఐరోపా సమాజము లో చేరిపోవచ్చు. ఇలా జరిగితే ఇంగ్లాండ్ మాత్రమే ఒంటరిదై పోతుంది. మరో ప్రమాదకర అంశమే మంటే లండన్ ను స్వతంత్ర దేశం గా ప్రకటించాలని ఉద్యమం కూడా ప్రారంభమయ్యే సూచనలున్నాయి.  


లండన్ నగరం



అసలు బ్రెగ్జిట్ సమస్య ఎందుకు తలెత్తింది? యుకె తన గురించి తాను ఎక్కువ గా ఊహించుకుందా? వేరే కారణాలున్నాయా? ఐరోపా దేశాలతో కలిసి బ్రిటన్ నాలుగు దశాబ్దాలకుపైగా ప్రయాణించినప్పటికీ పూర్తిస్థాయి అనుబంధం ఎన్నడూ లేదు.1975లో జరిగిన ప్రజాభిప్రాయసేకరణలో ఐరోపాతో కలిసి ఉండటానికి ప్రజలు తీర్పునిచ్చినప్పటికీ, ఆర్థికపరంగా ప్రయోజనాలు ఉంటాయనే ఆశించారు బ్రిటన్ పౌరులు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ప్రజల ఆలోచనలో మార్పువచ్చింది. ఆశించిన స్థాయిలో ప్రయోజనాలేవీ చేకూరలేదన్న సందేహాలు నెలకొన్నాయి.


ఈయూ నుంచి బ్రిటన్ బయటపడితే దేశ ఖజానాకు బోలెడంత ఆర్ధికన్ మిగులుతుందంటూ బ్రెగ్జిట్ అనుకూలవాదులు ప్రచారం చేపట్టారు. కూటమిలో వుండడం వల్ల ఈయూ సభ్య దేశంగా భారీఎత్తున ధనాన్ని కూటమికి ఇవ్వాల్సి వస్తోందని, కూటమి నుంచి బయటకొస్తే భారీ మొత్తాన్ని జాతీయ ఆరోగ్య పథకంపై వెచ్చించవచ్చని వివరించారు. ఆ ప్రయొజనం ప్రతివారం 35 కోట్ల పౌండ్ల (రూ.3,229 కోట్లు) వరకూ ఉండొచ్చని కాగితాల లెక్కలు వేశారు. ఇది ఓటర్లను విపరీతంగా ఆకర్షించింది. అయితే ఈ గణాంకాలు కచ్చితమైనవి కావని, చాలా ఎక్కువ చేసి చూపించారంటూ ఆర్థికశాఖ, బ్రెగ్జిట్ వ్యతిరేకులు చెప్పిన వివరణను ఎవరూ వినలేదు. ఏదైనా ప్రయోజనం లభించిండంటే ఈయు లో ఉండటం వలన యుకే పొందిన వెసుబాటు ఫలితమే నంటారు నిపుణులు. 


ఈయూ నుంచి బయటకొస్తే ఈ సమస్యల పరిష్కారం దొరుకుతుందని వెల్లడించారు. ఈయూ సభ్య దేశాలకు చెందినవారు ఈయూలో ఎక్కడైనా నివసించవచ్చు, పని చేసుకోవచ్చు. ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఈ విధానం వల్ల బ్రిటన్లతో పాటు ఇతర దేశాలవారు కూడా ప్రయోజనం పొందుతున్నారు. ప్రస్తుతం 12 లక్షల మంది బ్రిటిషర్లు ఇతర ఈయూ దేశాల్లో ఉంటున్నారు. దాదాపు 30 లక్షల మంది బ్రిటిషేతర ఈయూ దేశాలవారు బ్రిటన్లో ఉంటున్నారు. ఈ పరిస్థితి ఇప్పుడు మారుతుంది. ఈయు నుంచి బ్రిటన్ బయటకురావడానికి కీలకంగా నిలిచిన అంశం మైగ్రేషన్. ఐరోపాతోపాటు మిగిలిన దేశాల నుంచి తరలివస్తున్న వారి వల్ల తమ ఉపాధి అవకాశాలు లభించటం లేదని సగటు బ్రిటన్ వాసుల ఆవేదన, ఆందోళన, ఆలోచన కూడా! లక్షల్లో తరలివస్తున్న వలస వల్ల స్థానికులకు ఉపాధి తగ్గిపోవటమేగాక సాంస్కృతిక, సామాజిక రంగాల్లోనూ మార్పులొస్తున్నాయని విభజనవాదులు పేర్కొన్నారు. ఇటీవలికాలంలో లిబియా, టర్కీ నుంచి ఐరోపా దేశాలకు పోటెత్తిన వలసలు, అవి సృష్టించిన సమస్యలను గుర్తు చేశారు.


ప్రధాని కామెరాన్ సమైక్యవాదం వైపు నిలబడినప్పటికీ ఆయన మంత్రివర్గంలోని మంత్రులు కొందరు వ్యతిరేకించారు, ప్రత్యర్థులతో చేతులు కలిపారు. మేధావిగా పేరున్న మైఖేల్ గొవ్, బోరిస్ జాన్సన్ మద్దతుగా టీవీషోలు, స్ట్రీట్ షోలు, వివిధ వేదికల పై చర్చల్లో చేసిన వాదనలు ఓటర్లను అమితంగా ఆకట్టుకున్నాయి. ఇక బోరిస్ జాన్సన్ దేశవ్యాప్తంగా జరిపిన సుడిగాలి ప్రచారం విభజన శిబిరానికి గట్టి మద్దతును కూడగట్టారు. ఈ విజయంలో నైజిల్ ఫరేజ్ కూడా ప్రముఖపాత్ర పోషించారు ఆయన పేరు . యూకే ఇండిపెండెన్స్పార్టీ నేత. ఆయన వ్యాఖ్యలు తరచూ వివాదాస్పదమైనప్పటికీ, ఓటర్లను బ్రెగ్జిట్కు అనుకూలంగా ఆకర్షించగలిగాయి.

 

బ్రెగ్జిట్కు అనుకూలంగా వృద్ధులు పెద్దసంఖ్యలో ఓటు వేశారు. ముఖ్యంగా దక్షిణ, ఈశాన్య, ఆగ్నేయ బ్రిటన్ ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించినట్టు సర్వేల్లో వెల్లడైంది. 43 ఏళ్లపైబడిన వారిలో అధికశాతం ఈయూ నుంచి విడిపోయేందుకే మొగ్గుచూపారు. రెండేళ్ల కిందట వరకు స్కాట్లాండ్లో 16 ఏళ్ల వారికీ ఓటు హక్కు ఉండేది. ప్రధాని కామెరన్ తీవ్రంగా వ్యతిరేకించడంతో వారికి ఓటుహక్కు  లేకుండా పోయింది. వారికే ఓటుహక్కు ఉంటే ఫలితాలు తారుమారు అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.


Image result for united kingdom with member countries

మరింత సమాచారం తెలుసుకోండి: