తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత ఆయా రాష్ట్రాల అభివృద్ది కోసం ఇద్దరు ముఖ్యమంత్రులు ఎన్నో అభివృద్ది కార్యక్రమాల్లో తలమునకలైపోతున్నారు. రాష్ట్ర అభివృద్ది కోసం విదేశీ పెట్టుబడుల కో్సం ఇప్పటికే పలుమార్లు విదేశీ పర్యటనలు చేసివచ్చారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో చైనా బయల్దేరిన చంద్రబాబు బృందం ఆదివారం ఉదయం ఆ దేశ రాజధాని హాంకాంగ్ చేరుకున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు నాలుగు రోజుల చైనా పర్యటన కొనసాగనుంది.పర్యటనలో భాగంగా ప్రపంచ ఆర్థిక వేదిక వార్షికోత్సవంలో ఆయన పాల్గొననున్నారు.

వివిధ సంస్థల అధిపతులు, వాణిజ్య వేత్తలతో ఆయన భేటీకానున్నారు. వ్యవసాయం, ప్రజల కోరికపై పట్టణాల రూపకల్పన అంశంపై ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశంలో ఆయన కీలక ప్రసంగం చేయనున్నారు. రాజధాని నిర్మాణ పనుల్లో భాగస్వామిగా ఉన్న కంపెనీలను చంద్రబాబు బృందం సందర్శించనుంది. అలాగే ఎల్లుండి జరిగే వరల్డ్ ఎననామిక్ ఫోరం సదస్సులో పాల్గొంటారు.

కాగా చైనా పర్యటనలో చంద్రబాబు తో పాటు మంత్రులు నారాయణ, యనమల సహా పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.అనంతరం వ్యాపార ప్రముఖులతో ముఖ్యమంత్రి బృందం భేటీ కానుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వివరణ ఇవ్వనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: