వాట్సప్, ఫేస్ బుక్.. ఈ రెండూ లేకుండా ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఎవరూ వాడటం లేదు. నిమిషానికోసారి స్మార్ట్ ఫోన్ చూసుకోవడం ఇప్పుడు కామన్ అయ్యింది. ప్రత్యేకించి వాట్సప్ ఇప్పుడు ఎక్కువగా ఆదరణ పొందుతోంది. తమకు నచ్చిన వారంతా ఓ గ్రూప్ గా ఫామ్ అయ్యే ఛాన్సు ఉండటం.. వాటిలో వివిధ అంశాలపై చర్చలు జరపడం ఇప్పుడు కామన్ అయ్యింది. 

అయితే ఈ వాట్సప్ చర్చల్లో వాదాలు, సంవాదాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. తమకు నచ్చిన, నచ్చని అంశాలపై ఎవరి అభిప్రాయాలు వారు స్వేచ్ఛగా వెల్లడిస్తున్నారు. ఒక్కోసారి ఈ వాదాలకు అంతూ పొంతూ ఉండదు. అయితే సేమ్ గ్రూప్ కాబట్టి ఇప్పటివరకూ వీటితో ప్రాబ్లమ్ కనిపించడం లేదు.. కానీ ఇప్పుడు వాట్సప్ మేస్సేజ్ ల ఆధారంగా కూడా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. 


తాజాగా.. ఉత్తర ప్రదేశ్ లో అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్టు చేసిన ఒక సీఆర్ పీఎఫ్ జవాన్ ను, ఓ జర్నలిస్టును కూడా పోలీసులు అరెస్టు చేశారు. విషయం ఏంటంటే.. అలోక్ పాఠక్ అనే జర్నలిస్టు న్యాయ్ కా ప్రహారీ అనే పేరుతో ఒక వాట్సప్ గ్రూప్ మెయింటైన్ చేస్తున్నాడు. అందులో సభ్యుడుగా ఉన్న ఓ జవాన్ ఓ వర్గానికి వ్యతిరేకంగా కామెంట్స్ పోస్ట్ చేశాడు. 

ఆ కామెంట్లు కాస్తా షేరింగ్ ద్వారా చాలామందికి వెళ్లిపోయాయట. అవి మరీ అభ్యంతరకరంగా ఉండటంతో పోలీసులే సుమోటోగా యాక్షన్ తీసుకున్నారట. ఓ వర్గాన్ని కించపరిచేలా కామెంట్లు పోస్టు చేసినందుకు జవాన్ ను.. అలాంటి కామెంట్లు పెట్టగానే డిలీట్ చేయకుండా.. కంటిన్యూ చేసినందుకు సదరు జర్నలిస్టును పోలీసులు అరెస్టు చేశారట. అందుకే కాస్త వాట్సప్ వాడేటప్పుడు జాగ్రత్త. సంయమనం పాటించండి. 



మరింత సమాచారం తెలుసుకోండి: