పాపా పాపా ఎందుకు ఏడ్చావ్ అంటే ఆ కథ అలా అలా సాగుతూ చీమ పుట్టలో వేలు పెట్టడం దాకా వెళ్లిందట. అలా ఉంది ఇప్పుడు గోవా వారి పరిస్థితి. ఎక్కడో యూరోపియన్ యూనియన్ లో జరిగిన రాద్ధాంతం ఇప్పుడు వారి నెత్తిమీదకి వచ్చి పడింది. యూరోపియన్ యూనియన్ నుంచి బయటకి రావాలి అని బ్రిటీషర్ లు తీసుకున్న దృడ నిర్ణయం ప్రపంచాన్ని తీవ్రంగా కుదిపేస్తోంది.


తమని తామే దెబ్బతీసుకున్నాం అని రిఫరెండం ద్వారా బ్రిటీషర్లు వాపోతున్న తరుణం లో గోవా వాసులని ఈ వ్యవహారం ఇబ్బంది పెడుతోందట. ఎలా అనేది చూడాలి అంటే కాస్త చరిత్ర లో వెనక్కి వెళ్ళాల్సిందే మరి. గోవాని 450 సంవత్సరాల క్రితం పోర్చగీస్ వారు పరిపాలించేవారు. ఎప్పటికో 1961 ప్రాంతం లో గోవాని భారత్ లో కలుపుకున్నారు. 1961 కి ముందర పుట్టిన వారూ వారి పిల్లలూ అందరూ పోర్చ్ గీసు పౌరులుగా పోర్చ్ గీసు ప్రభుత్వం ఇప్పటికీ పరిగణిస్తోంది.

 సో ఒక నాలుగు లక్షల మంది వరకూ గోవాలో వారికి పోర్చ్ గీస్ ప్రభుత్వం పాస్ పోర్ట్ జారీ చేసింది. ఈ పాస్ పోర్ట్ లతో యూరోపియన్ సమాఖ్య లో ఉన్న దేశాలలో ఒకటైన పోర్చ్ గీస తో పాటు సమాఖ్య లో ఉన్న చాలా దేశాలలో ఉద్యోగాలు చేసుకునే ఛాన్స్ వీళ్ళలో అందరికీ ఉంటుంది. బ్రిటన్ లో గోవా వారు పోర్చగీస్ ల పేరుతో పాతికవేల మంది వరకూ ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడే స్థిర పడిపోయారు. గోవా వాసులకి బ్రిటీషర్ర్లు ఉద్యోగాలు ఇవ్వడానికి కారణం కూడా వారికి ఇంగ్లీష్ బాగా వచ్చు గనకనే ..

 

ఇప్పుడు ఏమవుతుంది ..

 

ఇప్పుడు ఈ రిఫరెండం తరవాత మొన్నటి వరకూ గోవాలో పోర్చ్ గీస పాస్ పోర్ట్ కార్యాలయం భారీగా నిండిపోగా ఇప్పుడు ఖాళీ అయిపొయింది. బ్రిగ్జెట్ లో తీసుకున్న తాజా నిర్ణయంతో తాము బ్రిటన్ వెళ్లే అవకాశాన్ని కోల్పోయినట్లుగా భావిస్తున్నారు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారు.. యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు రావాలన్న నిర్ణయాన్ని తీసుకోవటంపై వారు బాధకు గురి అవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: