ఆంధ్ర ప్రదేశ్ర్ రాష్ట్రం లో నిత్యం ఎదో ఒక ఉపయోగపడే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తాజాగా " ప్రకృతి పిలుస్తోంది " అనే ప్రకృతి ని కాపాడే ప్రోగ్రాం మొదలు పెట్టారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలలోకి తీసుకుని వెళ్ళాలి అనీ ప్రతీ అధికారీ , ప్రతీ ప్రజా ప్రతినిధీ ఈ విషయం లో సీరియస్ గా ఉండాలి అని చంద్రబాబు కోరారు. ఒక్కొక్క మనిషీ 10 చెట్లు చొప్పున గనక పెంచగలిగితే రాష్ట్ర వ్యాప్తంగా యాభై కోట్ల చెట్లు పెంచవచ్చు అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

 

 

ఒక్క రోజు లో కోటి మొక్కలు నాటే కార్యక్రమం రాబోతోంది అనీ దానికి తగ్గట్టుగా కోటి గుంటలు - పిట్స్ తవ్వి సిద్ధంగా ఉంచాలి అని అధికారులని కోరారు బాబు. తాను త్వరలో చైనా వెళ్ళబోతున్నాను అనీ వచ్చే లోగా పంటకుంటల తవ్వకం , జల సంరక్షణ పనులు, మొక్కల పెంపకం , సిమెంట్ రోడ్లూ ఇలాంటివి అన్నీ నిర్మించాలి అనీ సీరియస్ గా చెయ్యాల్సిన పనులలో అలసత్వం కనిపిస్తే వదలను అని ఆయన వార్నింగ్ కూడా ఇచ్చారు. నీటిని భద్ర్హం చేసుకుంటే భవిష్యత్తు తరాలని అవే కాపాడతాయి అనీ అందుకోసం చెట్లు పెంచడం పరిపాటి అన్నారు ఆయన.

 

అటవీ సంపద పెరగాలి ..

 

నీటి యొక్క భద్రత , చెట్లు పెంచడం , సిమెంట్ రోడ్ల నిర్మాణం , మరుగుదొడ్ల నిర్మాణ, ప్రతీ గ్రామానికీ కంపోస్ట్ యూనిట్ లని ఏర్పాటు చెయ్యడం లాంటి ఐదు పంచ శీల సూత్రాలనీ అధికారులు పాటించి ప్రజల చేత పాటింపజేయాలని కోరారు. ప్రస్తుతం అటవీ విస్తీర్ణం రాష్ట్రం లో 26 % ఉండగా దాన్ని యాభై శాతం చెయ్యాలనేది తమ లక్ష్యం అని చెప్పుకొచ్చారు. " అందమైన ప్రకృతి పెరిగే కొద్దీ పర్యాటకులు పెరుగుతారు .. పర్యాటక రంగం లో ఏపీ నెంబర్ 1 గా ఉండాలి అనేది నా కోరిక. రాష్ట్రాలకి ఆ రకంగా భారీ రాబడి పెరగడం తో పాటు అంతర్జాతీయ గుర్తింపు కూడా వచ్చి తీరుతుంది " అన్నారు బాబు. రెండు వారాల నుంచీ కుంతల తవ్వకాలు సాగుతున్నాయి. నెలాఖరు లోగా పనులు పూర్తి అవుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: