చెన్నైలో జరిగిన నలుగురు మహిళల హత్య కేసులో ఆసక్తికరమైన వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల రాయపేట పోలీసుస్టేషన్ సమీపంలో ముత్తువీధిలో 38 ఏళ్ల పాండియమ్మాల్, ఆమె ముగ్గురు కూతుళ్లు దారుణ హత్యకు గురయ్యారు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కేసు దర్యాప్తు చేసిన పోలీసులు పాండియమ్మాళ్ తో సహజీవనం చేస్తున్న 35 ఏళ్ల చిన్నరాజ్ ఈ హత్యలు చేసినట్టు తేల్చారు. నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు చెబుతున్న వాస్తవాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. భర్త వదిలేసిన పాండియమ్మాళ్ చిన్నరాజ్ తో సహజీవనం చేస్తోంది. 


పాండియమ్మాళ్, ఆమె ముగ్గురు కూతుళ్లనూ చిన్నారాజ్ పోషించేవాడట. ఇటీవల పాండియమ్మాళ్ కొంతకాలంగా అనారోగ్యానికి్ గురైందట. ఆ సమయంలో చిన్నరాజ్ శారీరక వాంఛలను ఆమె తీర్చేది కాదు. దీంతో అసంతృప్తికి గురైన చిన్నరాజ్ ఆమె పెద్ద కూతురు పవిత్ర ను తనకు ఇచ్చి పెళ్లి చేయమని ఒత్తిడి తెచ్చారట. 

పెళ్లికాకపోయినా చిన్నరాజ్ తో సహజీవనం చేస్తున్నందువల్ల కూతురు వరసైన పవిత్రతో పెళ్లి కరెక్టుకాదని పాండియమ్మాళ్ గొడవ పెట్టుకుందట. అప్పటి నుంచి చిన్నరాజ్ ను ఇంటికి రానివ్వడం లేదట. నిన్నమొన్నటి వరకూ తన సంపాదనపై బతికిన కుటుంబం.. తననే ఇంటికి రానివ్వకపోవడం, తన కోరిక తీరకపోవడంతో చిన్నరాజ్ సైకోలా మారి నలుగురినీ చంపేశాడట.  



మరింత సమాచారం తెలుసుకోండి: