డబ్బంటూ ఉండాలే కానీ ఈ ప్రపంచంలో ఆస్వాదించగలిగిన ఆనందాలు ఎన్నో.. ఈ ప్రపంచం అందాలమయం. ఎన్నో వింతలు, విశేషాలు.. ఈ అందాల భూమిలో చూడతగిన పర్యాటక ప్రాంతాలెన్నో.. మరి ఈ అందాలన్నీ చూడాలంటే ఎలా.. ఆ కోరిక తీరాలంటే కోట్లకొద్దీ డబ్బు ఉండాలి. 


కానీ  ఓ ముద్దుగుమ్మ మాత్రం తన అందాలనే ప్రపంచ పర్యటనకు ముడిసరుకుగా మార్చేసింది. డబ్బున్న మగాళ్లతో డేటింగ్ చేస్తూ ప్రపంచ దేశాలు చుట్టి వస్తోంది. అక్కడి వింతలు, విశేషాలు ఆస్వాదిస్తోంది.. బ్రిటన్‌లోని కాంటర్‌బరీకి చెందిన 30 ఏళ్ల ముద్గుగుమ్మ నటాలి వుడ్‌ ఒక్క పైసా కూడా చేతి నుంచి ఖర్చు పెట్టకుండా ప్రపంచ పర్యటన చేస్తోంది. 


డేటింగ్ వెబ్‌సైట్ ‘మిస్ ట్రావెల్’లో రెండేళ్ల క్రితం సభ్యత్వం తీసుకున్న నటాలి తనతో డేటింగ్ చేస్తున్న సంపన్నులను ఈ ప్రపంచ పర్యటనకు ఎంచుకుంటోంది. ఆయాదేశాల్లో ఉండే సంపన్నులతో డేటింగ్ చేస్తూ టూరిస్టు ప్రాంతాలన్నీ చుట్టేస్తోంది. 


ఏ దేశం వెళ్తే ఆ దేశంలోని సంపన్నులతో నటాలి ఎంజాయ్ చేస్తోంది. ఆమె పర్యాటక ఖర్చులన్నీ ఆ సంపన్నులే పెట్టుకుంటారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా. 


ఇప్పటికే ఇలా డేటింగ్ ద్వారా నటాలి.. టర్కీ, అబుదాబీ, దుబాయ్, కువైట్, మాల్దీవులు, ఆస్ట్రేలియా, చెక్ రిపబ్లిక్ లాంటి 80 దేశాల్లో విహరించింది. సంపన్నులను సంతృప్తి పరుస్తూ.. ఆమె ఖరీదైన షాపింగ్ కూడా చేస్తోందట.


అంతేకాదు.. ఈ ప్రపంచ పర్యటన ద్వారానే తగిన జీవిత భాగస్వామిని ఎంచుకుంటుందట. తానెవరినీ మోసం చేయడం లేదని.. స్థోమత ఉన్న వాళ్లే తనను భరిస్తున్నారని చెబుతోంది నటాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: