ప్రజలకిచ్చిన మాటను ఎట్టిపరిస్థితుల్లోనూ తప్పబోమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న మాటకు కట్టుబడి ఉంటామన్నారు. మైనార్టీల రిజర్వేషన్ల కోసం ఇప్పటికే ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమిటీ నివేదిక రాగానే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి తీర్మానాన్ని దిల్లీకి పంపుతామన్నారు. ఆదివారం నిజాం కళాశాల మైదానంలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.



నేను మాట ఇస్తే దానికి కట్టుబడి ఉంటాను. ఇది మీ అందరికీ తెలుసు. ముస్లిం రిజర్వేషన్లు సాధించుకోవడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశాం. ఆ కమిటీ కొన్ని రోజుల్లోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నది. ఆ నివేదిక రాగానే అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లకు సంబంధించి తీర్మానం చేస్తాం. ఆ తీర్మానాన్ని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకెళ్ళి అమలు చేయిస్తాం. రిజర్వేషన్ల ఆంశంలో మనం తప్పకుండా విజయం సాధిస్తామన్న నమ్మకం నాకుంది అని సీఎం ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం వివిధ వర్గాల వారి సంక్షేమం, అభివృద్ధితోపాటు రాష్ట్ర పురోగతికి చేపడుతున్న కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రం దేశానికే కాదు, ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నదని

CM_KCR


ఈ ఏడాదే 120 మైనార్టీ గురుకుల పాఠశాలలను ప్రారంభించనున్నట్లు కేసీఆర్‌ చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మైనార్టీల సంక్షేమం కోసం అధిక నిధుల్ని కేటాయించామన్నారు. రూ.1200 కోట్ల పైగా నిధులతో ముస్లింలకు షాదీ ముబారక్‌ వంటి వివిధ రకాల సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వమే అధికారికంగా ముస్లింల కోసం మసీదుల్లో ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేసిందన్నారు. హిందువులు, ముస్లింల ఐకమత్యానికి ఇఫ్తార్‌ విందులు వేదికగా నిలుస్తాయని చెప్పారు. ముస్లిం సోదరులకు ఆయన రంజాన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.


\

మరింత సమాచారం తెలుసుకోండి: