చైనా పర్యటనలో ఉన్న చంద్రబాబు తొలిరోజే ఏపీకి చెప్పుకోదగిన పెట్టుబడులు సాధించారు. మొదటి రోజు ఆయన వరుసగా పలువురు వాణిజ్య వేత్తలతో భేటీ అయ్యారు. చైనా కంపెనీ అన్‌స్టీల్ ను ఏపీలో 3 వేల కోట్ల పెట్టుబడులతో ఉక్కు కర్మాగారం స్థాపించేందుకు ఒప్పించారు.


నౌకాయాన, ఆతిథ్య రంగాలలో 9 బిలియన్ డాలర్ల టర్నోవర్ కలిగిన లిబ్రాగ్రూప్ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. లిబ్రా గ్రూపు ఆసియా విభాగపు కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని కోరారు.

ఆ తరవాత విమానయాన రంగంలో పేరున్న మిత్సుబిషి కంపెనీతోనూ చర్చలు జరిపి హామీ పొందారు.


వలంటీర్ టెక్నాలజీస్ గ్లోబల్ హెడ్ డీవ్ గ్లేజర్‌తో సమావేశమయ్యారు చంద్రబాబు. అనలిటిక్స్, డేటాబేస్ సైబర్ సెక్యూరిటీ అంశాలలో కలిసి పని చేద్దామంటూ ఆహ్వానించారు. పవన విద్యుత్ రంగంలో ప్రసిద్ధి చెందిన ఓజిన్ కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్ డాక్టర్ వాలరీ ఫెల్డ్‌మన్ కలుసుకున్నసీఎం ఏపీపై దృష్టిపెట్టాలని కోరారు.


ఐటి రంగంలో ప్రసిద్ధి చెందిన హ్యూలెట్ ప్యాకార్డ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ రొజేరియో రిజీతోనూ ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. విద్యా రంగంలో ఐటీ ఉత్పత్తులను, సేవల్ని అందించిన ఎస్ప్రాంజా ఇన్నోవేషన్స్ ఫౌండర్ మణీందర్ బజ్వాకూడా బాబు కలిసిన వారిలో ఉన్నారు. చైనాలో అతిపెద్ద ఇంధన పరిశ్రమగా ఉన్న డాంగ్‌ఫాంగ్ ఎలక్ట్రిక్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సన్ జెన్ ‌పింగ్ భేటీ అయ్యారు. భేటీలు జోరుగానే సాగుతున్నాయి. మరి వాటిలో ఎన్ని పెట్టుబడులుగా మారతాయో చూడాలి.





మరింత సమాచారం తెలుసుకోండి: