ఏపీ సచివాలయాన్ని చంద్రబాబు సర్కారు యుద్ధ ప్రాతిపదికన కట్టిస్తున్నారు. వాస్తవానికి ఉద్యోగులు హైదరాబాద్ నుంచి తరలి రావాల్సిన తుది గడువు జూన్ 27. ఆ గడువు నాటికి అంతా తరలిరావాల్సిందేనని చంద్రబాబు పదే పదే వార్నింగ్ ఇచ్చారు. ఓ వైపు సచివాలయం నిర్మాణం పూర్తికాకపోయినా అద్దె కార్యాలయాల్లోనైనా పని ప్రారంభించాల్సిందేనని పట్టుబట్టారు.


మరి ఏపీ సచివాలయంలోని ఆరు బ్లాకుల నిర్మాణం ఏ స్థాయిలో ఉందో ఓ సారి పరిశీలిద్దాం. ఆరు బ్లాకులు దాదాపు పూర్తయ్యాయి. కాకపోతే.. ఇంటీరియల్ డెకరేషన్, కేబిన్ వర్క్స్ జరుగుతున్నాయి. వీటిలో ముందు ఐదో బ్లాక్ నిర్మాణం పూర్తి చేసుకుంది. ఈ భవనాన్ని పంచాయితీ రాజ్, ఆరోగ్యం, గృహనిర్మాణశాఖలకు అప్పగిస్తారు. ఇక్కడ 29 తేదీ నుంచి అధికారికంగా ఈ శాఖలు అమరావతి నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తారు.


ఒకటో బ్లాకు మొత్తాన్ని పూర్తిగా సీఎం, సీఎంఓ కార్యాలయానికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు సాధారణ పరిపాలన శాఖకు కేటాయించారు. ఇందులోనే సాధారణ పరిపాలనశాఖ, న్యాయశాఖలకు చెందిన కార్యాలయాలు, శాఖ కార్యదర్శి కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు.


రెండో బ్లాకు - ఇందులో ఐదుగురు మంత్రులు, ఆయా శాఖలకు చెందిన కార్యాలయాలను కేటాయించారు. ఆర్ధిక శాఖ, ప్రణాళికా విభాగాలకు మొదటి అంతస్తులోను, దిగువన పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ, ఇంధన, పరిశ్రమలు, హోంశాఖ కార్యాలయాలకు కేటాయించారు.


మూడో బ్లాకు - ఇందులోని మొదటి అంతస్తులో సాంఘిక సంక్షేమశాఖ, బీసీ సంక్షేమశాఖ, నైపుణ్యాభివృద్ధి, మహిళా శిశుసంక్షేమాభివృద్ధి శాఖలకు కార్యాలయాలను కేటాయిస్తూ ప్రణాళిక చేశారు. ఈ భవనంలో దిగువన ఐటీ, ఎన్ఐసీ, సెంట్రల్ రికార్డ్ రూమును ఏర్పాటు చేయనున్నారు.


నాలుగో బ్లాకు - ఇందులో జలవనరుల శాఖ, మానవవనరుల శాఖతో పాటు పాఠశాల, ఉన్నత విద్యాశాఖలకు చెందిన కార్యాలయాలు, ఐదుగురు మంత్రులకు కార్యాలయాలను కేటాయించారు. దిగువ అంతస్తులో రెవెన్యూ, వ్యవసాయశాఖ, అనుబంధశాఖల కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: