ఏపీ తెలంగాణ మరోసారి కేంద్రం దగ్గర పంచాయితీ పెట్టుకుంటున్నాయి. ఉమ్మడి సంస్థల మధ్య ఆస్తుల విభజన పూర్తికాకపోవడం చిక్కులు తెచ్చిపెడుతోంది. తమ భూభాగంలో ఉన్న సంస్థలు మావేనని తెలంగాణ అంటుంటే... మా వాటా మాకు వస్తుందని ఏపీ వాదిస్తోంది.  హైదరాబాద్ లాలాపేట్ లో ఏపీ డెయిరీ సంస్థకు డెయిరీ యూనిట్లు, చిల్లింగ్ సెంటర్లు, ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్లు, పాల ఉత్పత్తుల ఫ్యాక్టరీ ఉన్నాయి. అలాగే సోమాజిగూడలో ఓ గెస్ట్ హౌజ్ కూడా ఉంది. ఇవన్నీ తెలంగాణలో ఉన్నాయి కాబట్టి మావేవంటూ తెలంగాణ సర్కారు ఈ ఆస్తులను తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్ మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ కు బదిలీ చేస్తూ జూన్ 6న జీవో ఇచ్చింది.


ఐతే.. ఈ జీవో తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా జారీ చేసిందని ఇప్పుడు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఇది రాష్ట్ర విభజన చట్టానికి పూర్తి విరుద్ధమని.. ఈ సంస్థ విభజన పూర్తి కాలేదని తెలిపారు. ఆ చట్టంలోని సెక్షన్ 53 ప్రకారం హెడ్ క్వార్టర్స్ అన్న పదంపై కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు.


తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో పై ఉభయ రాష్ట్రాల మధ్య ఎలాంటి చర్చలు , పరస్పర అంగీకారం జరగలేదని పేర్కొన్నారు. ఈ జీఓకు అనుబంధంగా సంస్థ ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు కేటాయిస్తూ ఆ సంస్థ ఎండీ మార్గదర్శకాల ఇవ్వడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ఈ జీవోను తెలంగాణ సర్కారుతో ఉపసంహరింపజేయా లని ఏపీ సర్కారు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. మరి ఏంజరుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: