ఒక‌వైపు, విశ్వ‌న‌గ‌రంగా తీర్చిదిద్దుతామ‌ని తెలుపుతూ, మ‌రోవైపు భారీ కుంభ‌కోణానికి తెర తీశారు చంద్ర‌బాబు అండ్ కో. ఇదే విష‌యం పై ప్ర‌తిప‌క్ష పార్టీలు అధికార పార్టీ పై ఓ రెంజీ లో దుమ్మెత్తి పోస్తున్నారు. అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం స్విస్ ఛాలెంజ్ ప‌ద్ద‌తి లో నిర్మాణం చేపడ‌తామ‌ని చెబుతుంది స‌ర్కార్. ఇప్పటికే ప్రపంచ వ్యాపారవేత్త‌ల‌తో ఒప్పందాలపై చంద్ర‌బాబు పెట్టేసుకున్నారు. సింగ‌పూర్ కంపెనీలు చాలా వ‌రకు పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌స్తున్నాయి. అయితే స్విస్ ఛాలెంజ్ విధానం లో ఉన్న మ‌ర్మం ఏమిటో సామాన్య ప్ర‌జ‌ల‌కు ఎప్ప‌టికీ అర్ధం కాదు. అయితే స‌ద‌రు స్విస్ ఛాలెంజ్ ప‌ద్దితిలో పెద్ద‌గా మోసం ఏమీ ఉండ‌దు. బెస్ట్ ప్ర‌పోజ‌ల్ ఇచ్చిన కంపెనీల వివ‌రాలను బ‌హిర్గ‌తం చేసి, అవే ప్రమాణాలు పాటిస్తూ... అంతే అనుభ‌వం గ‌ల ఏ ఇత‌ర కంపెనీ అయినా... అంత‌కంటే త‌క్కువ‌కు చేస్తాం అని చెబితే వారికి అప్ప‌గిస్తారు. ఇది ప్ర‌భుత్వ వాద‌న‌, అయితే స్విస్ ఛాలెంజ్ వివ‌రాల‌ను ఒక్క‌సారి గ‌మ‌నించినా, ప్ర‌తిప‌క్షాలు చెప్పిన వాద‌న‌లు సైతం దీనికి భిన్నంగా ఉన్నాయి.

ఉమ్మ‌డి సీఎం గా చంద్ర‌బాబు కు భారీ ముడుపులు...

అయితే ఈ స్విస్ ఛాలెంజ్ విధానం ప్ర‌కారం... ప్రైవేట్ సంస్థ‌లే మొత్తం అధ్య‌య‌నం చేసుకుని త‌న అంచ‌నా వ్య‌యంతో నివేదిక‌ను  త‌యారుచేసుకుని ప్ర‌తిపాద‌న చేయ‌వ‌ల‌సి ఉంటుంది. ఆ త‌రువాత  ఆ ప్ర‌తిపాద‌న‌ను ఆ స‌క్తి ఉన్న ఇత‌ర కంపెనీల‌ను తెలియ‌జేస్తారు. అంత‌క‌న్నా  మెరుగైన ప్ర‌తిపాద‌న ఇవ్వ‌గలుగుతారేమో అడుగుతారు. ఎవ‌రైనా ఆ ప్ర‌తిపాద‌న ఇస్తే తిరిగి అస‌లు ప్ర‌తిపాద‌న చేసిన వారితో సంప్ర‌దిస్తారు. ఇలాంటి విధానంతో గ‌తంలో చంద్ర‌బాబు భారీ ముడుపులే ముట్టాయ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ విధానాన్ని గ‌త ఉమ్మడి ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి గా ఉన్న‌ప్పుడే అమ‌లు చేశారు చంద్ర‌బాబు. అప్పట్లో నిజాం  సుగ‌ర్స్ కు చెందిన కొన్ని యూనిట్ల‌ను స్విస్ ఛాలెంజ్ ప‌ద్దతిలోనే బ‌దలాయింపు చేశారు. ఈ విధానంలో నిజాం సుగ‌ర్స్ విక్ర‌యం పై చాలా విమ‌ర్శ‌లే వచ్చాయి. ఈ కుంభ‌కోణంలో చంద్ర‌బాబు కు భారీ ముడుపులు అందాయ‌న్న వార్త‌లు ఉన్నాయి. తాజాగా అమ‌రావ‌తి రాజ‌ధాని లో నిర్మాణంలో ఇదే విధానాన్ని అవ‌లంభిస్తున్నారు ఏపీ సీఎం. గ‌త కొద్ది నెల‌ల క్రిత‌మే అవినీతి నిరోధ‌క చ‌ట్టంలోనూ, స్విస్ ఛాలెంజ్ విధానంలోనూ అవినీతి, ఆశ్రిత ప‌క్ష‌పాత పెరుగుత‌తాయ‌న కేల్క‌ర్ కమిటీ సిఫార్సులు తెలియ‌జేస్తున్నాయి.

స్విస్ ఛాలెంజ్ విధానం ప్రోత్స‌హించ‌వ‌ద్ద‌న్న విజ‌యకేల్క‌ర్ క‌మిటీ...

త‌క్ష‌ణం అవినీతి నిరోధ‌క చ‌ట్టంలో మార్పులు చేయాల‌నీ,  మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న ప్రాజెక్టుల‌కు అనుస‌రిస్తున్న స్విస్ ఛాలెంజ్ విధానాన్ని ప్రోత్స‌హించ‌వ‌ద్ద‌నీ, ప్ర‌భుత్వ, ప్రైవేటు భాగ స్వామ్యం ప‌ద్ద‌తికి  పార్ల‌మెంట్ ఆమోదం పొందాల‌నీ ఆర్థిక శాఖ మాజీ కార్య‌ద‌ర్శి విజ‌య‌కేల్క‌ర్ క‌మిటీ సిఫార్సులు చేస్తూ, నివేదిక‌ను ప్ర‌భుత్వానికి అందించింది. సంస్క‌ర‌ణల పేరుతో భూముల‌ను , ప్రాజెక్టుల‌ను ప్రైవేట్ వ్య‌క్తుల‌కు క‌ట్ట‌బెట్టి కొద్దిమంది వ‌ద్ద సంప‌ద పోగ‌య్యే విధానాన్ని అనుస‌రిస్తున్న మోడీ ప్ర‌భుత్వం, కేల్క‌ర్ సిఫార్సుల పైన గ‌ట్టిగా దృష్టి పెట్టి పార్ల‌మెంట్ లో చ‌ర్చ‌క‌కు పెట్ట‌లేదు. నాటి నుంచి కేంద్ర ప్ర‌భుత్వం స్విస్ ఛాలెంజ్ విధానాన్ని దాదాపుగా పక్కన పెట్టింది. చంద్ర‌బాబు మాత్రం ఇదే విధానాన్ని అవ‌లంభించ‌డం నిజంగా ఆలోచించాల్సిన విష‌యమే. ఇది ఒక ఎత్తైతే... ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు కొత్త రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం విష‌యంలో రైతుల నుంచి తీసుకున్న భూములు మొత్తాన్ని సింగ‌పూర్ కంపెనీల పాదాల వ‌ద్ద పెట్టేయడానికి చంద్ర‌బాబు నాయుడు అండ్ కో నిర్ణ‌యం తీసుకున్నట్టుగా ఉంది. ఈ ప‌ద్ద‌తి లో నిర్మాణాల‌కు ముందుక వ‌చ్చే కంపెనీల‌కు భూముల్లో 58 శాతం కెటాయించి, 42 శాతం మాత్రం రాష్ట్ర ప్ర‌భుత్వానికి  కేటాయించేలా ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నారు. 

రాజ‌ధాని నిర్మాణం విదేశీ కంపెనీల‌కు క‌ట్ట‌బెట్టిన చంద్ర‌బాబు...

అయితే ఇలా అధిక శాతం వాటా విదేశీ కంపెనీల‌కు క‌ట్ట‌బెట్టి రాజ‌ధాని నిర్మాణం సాగించ‌డం ఏమిటో సామాన్యులకు ఆర్ధం కావడంలేదు. అమ‌రావ‌తి పేరు చెప్పి రైతుల నుంచి భూముల‌ను సేక‌రించిన‌ప్పుడు, 50 శాతం మాత్రం నిర్మాణ కంపెనీల‌కు ఇచ్చి... మిగిలిన 50 శాతం లో రైతుల‌కు 25 శాతం ఇచ్చి, 25 శాతం ప్ర‌భుత్వం తీసుకుంటుంద‌ని అంటూ చెప్పుకొచ్చారు. తీరా ఇప్పుడు కేటాయింపుల స‌మ‌యం వ‌చ్చే స‌రికి వ‌చ్చే  నిర్మాణ కంపెనీల‌కు 58 శాతం  అవుతుంది. రాష్ట్ర ప్ర‌భుత్వానికి వ‌చ్చే 42 శాతాన్ని రైతుల‌కు, ప్ర‌భుత్వానికి ఎలా వాటాలు పంచుతారో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వద్ద స్ప‌ష్టత లేదు.  అన్నింటా పారద‌ర్శ‌క‌త, పాల‌న లో పారద‌ర్శ‌క‌త అంటూ చంద్ర‌బాబు ప్ర‌సంగాలు గుప్పిస్తారు కానీ. వాస్త‌వం లో సద‌రు పారద‌ర్శ‌క‌త‌క‌కు పాత‌ర వేస్తున్నారు. ప్ర‌భుత్వం తీసుకునే 42 శాతంలో రైతులను వంచించ‌కుండా వారి 25 శాతం వాటా వారికి ఇచ్చేస్తే గ‌న‌క‌.... ఇక ప్ర‌భుత్వానికి మిగిలేది కేవ‌లం 17 శాతం మాత్ర‌మే. అయినా ముందుగా 50 శాతం నిర్మాణ కంపెనీల‌కు అనుకున్న త‌రువాత‌... ఇప్పుడు హ‌ఠాత్తుగా 58 శాతానికి ఎందుకు పెంచ‌వ‌ల‌సి వ‌చ్చింద‌నేది జనం ముందున్న ప్ర‌శ్న‌. 

అమ‌రావ‌తిలో ప్రైవేట్ సంస్థ‌ల భ‌వ‌నాలే ఎక్కువ‌...

నిజంగా ఆయ‌న చెబుతున్న స్విస్ ఛాలెంజ్ విధానం అంత  పారద‌ర్శ‌కం అయితే , కేంద్రం రాజ‌ధాని కోసం మంజూరు చేసే నిధుల‌ను కూడా ఈ విధానంలో ఖ‌ర్చు పెట్ట‌గ‌లరా? ఇది జ‌రిగే ప‌ని కాద‌ని ప్ర‌భుత్వంలోని ఉన్న‌త స్థాయి వ‌ర్గాలు స్ప‌ష్టం చేశాయి. కేంద్రం మంజూరు చేసే నిధుల‌తో చేప‌ట్టే ఏ ప‌ని అయినా పోటీ బిడ్డింగ్ విధానం కింద టెండ‌ర్ పిలిచి ప‌నులు అప్ప‌గించాల్సిందే. అంటే సచివాల‌యం మొద‌లుకుని... అసెంబ్లీ, హైకోర్టు భ‌వ‌నాలు అన్నీ కూడా ప్ర‌భుత్వం టెండ‌ర్ పిలిచి ప‌నులు చేప‌ట్టాల్సి ఉంటుంది.  కానీ ఇప్పుడు జ‌రుగుతున్న ప్ర‌చారం అంతా రాజ‌ధాని క‌ట్టేది సింగ‌పూర్, చైనా, జ‌పాన్  సంస్థ‌లు అని. భ‌వ‌నాలు ప్లాన్ లు.. స్కెచ్ లు ఎవ‌రైనా ఇవ్వొచ్చు. అస‌లు టెండ‌ర్లు పిల‌వ‌కుండానే రాజ‌ధాని నిర్మాణం చేప‌ట్టేది సింగ‌పూర్ సంస్థ‌లని ఎలా చెప్ప‌గ‌లుగుతున్నారు?  టెండ‌ర్లు పిలిస్తే క‌దా? ఎవ‌రు ఇందులో విజేత‌గా నిలుస్తారో తేలేది?  ఇక‌పోతే ప్ర‌స్తుతం అమ‌రావ‌తి పేరుతో ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన విస్తృతంగా ప్ర‌చారం లో ఉన్న ఊహ‌చిత్రాల్లో ఏదీ కూడా ప్ర‌భుత్వ భ‌వ‌నం కాద‌ని, అవ‌న్నీ ప్రైవేట్ సంస్థ‌ల కోసం నిర్మించుకునే వాణిజ్య స‌ముదాయాలు. రాష్ట్ర విభ‌జ‌న జరిగిన త‌రువాత ఏపీ రాజ‌ధానితో పాటు స‌రైన మౌలిక సదుపాయాలు లేక ఇబ్బంది ప‌డుతున్నది వాస్తవం. 

ప్రైవేట్ సంస్థ‌ల‌తో స‌ర్కార్ ర‌హ‌స్య ఒప్పందాలు....

అయితే ఈ పేరు చెప్పుకుని ప్రైవేట్ సంస్థ‌ల‌తో ర‌హ‌స్య ఒప్పందాలు చేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నా య‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. సింగ‌పూర్ ప్ర‌భుత్వం కూడా రాజ‌ధాని విష‌యంలో ఎక్క‌డా నేరుగా పాల్గొన‌టం లేదు. సింగ‌పూర్  మంత్రి ఈశ్వ‌రన్ వాణిజ్య శాఖ మంత్రిగా త‌మ దేశానికి చెందిన కంపెనీల‌కు వ్యాపార అవ‌కాశాలు కల్పించేందుకే ప‌దే ప‌దే రాష్ట్ర ప్ర‌భుత్వం పిలిచిన‌ప్పుడ‌ల్లా రావ‌డంతో పాటు ఏపీకి చెందిన అధికారుల‌కు త‌న‌ను క‌లిసే అవ‌కాశం క‌లిపిస్తున్నారు. ఇక‌పోతే గతంలో సింగ‌పూర్ ప్ర‌భుత్వం త‌మ‌కు మాస్ట‌ర్ ప్లాన్ ఉచితంగా ఇచ్చింద‌ని ప‌దే ప‌దే చెప్పుకుంటున్న స‌ర్కార్ ఇదే మాస్ట‌ర్ ప్లాన్ కోసం సుర్బానా సంస్థ‌కు వివిధ మార్గాల్లో 12 కోట్ల రూపాయ‌లు చెల్లించబోతుంది. మొత్తం మీద నూత‌న రాజ‌ధాని నిర్మాణ పేరుతో భారీ కుంభ‌కోణానికి తెర తీశార‌న్న‌ది ప్ర‌తి ప‌క్షాలు, ప్ర‌జా సంఘాల వాద‌న‌... మరీ దీనిపై సీఎం చంద్ర‌బాబు ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి...!


మరింత సమాచారం తెలుసుకోండి: