అడిగినవి అన్నీ కేంద్ర ప్రభుత్వం తెచ్చి చేతిలో పెడుతుంటే ఎవరికి మాత్రం సంతోషంగా ఉండదు? ప్రస్తుతం తెలంగాణా ఐటీ - మునిసిపల్ శాఖ మంత్రి కే టీ ఆర్ పరిస్థితి అదే . ముఖ్యమంత్రి కి కొడుకు కూడా అయిన ఈయన ఇప్పుడు ఫుల్ ఖుషీ లో ఉండడానికి కేంద్రం నుంచి వస్తున్న పాజిటివ్ సిగ్నల్స్ అని చెప్పాలి. రాష్ట్ర విభజన తరవాత ఏపీ - తెలంగాణా రెండింటికీ కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పన్ను సేవలు ప్రకటించింది. ప్రోత్సాహకాల రూపం లో ఇవి ఉంటాయి.

 

 రెండు సంవత్సరాల విభజన తరవాత కూడా వీటిని అమలు చేసే ఉద్దేశ్యం లో కేంద్రం కనపడ్డం లేదు అని కేటీఆర్ స్వయంగా డిల్లీ లో అడుగుపెట్టారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతరామన్ ని స్వయంగా అపాయింట్మెంట్ అడిగి మరీ కలిసిన మంత్రి ఆ ప్రోత్సాహకాల పనితీరు అమలు అయితే జరిగే మేలు గురించి చెప్పుకొచ్చారు . ఆమె కూడా అవసరం మేరకు అపాయింట్మెంట్  వెంటనే ఇచ్చి ఈ విషయం మీద చాలా సానుకూలంగా స్పందించారు. ఈ విషయం ఇప్పటికే తమ మంత్రివర్గ పరిశీలనలో ఉంది అని చెప్పడం తో కేటీఆర్ ఫుల్ ఖుషీ అయ్యారు అని తెలుస్తోంది. మొదటి సారి మంత్రి అయ్యి తన రాష్ట్రానికి కవాల్సిననవి అన్నీ కేంద్రం నుంచి రప్పించుకోగల సత్తా ఏర్పాటు చేసుకున్న మంత్రి వర్యులుకి ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది ?


 

హైదరాబాద్ కి నిధులు ..

 

నిర్మలా సీతరామన్ ని కలిసిన కాసేపటి తరవాత మీడియా కి కనిపించిన ఆయన రెండు రాష్ట్రాలకీ విభజన సమయం లోనే కేంద్ర ప్రభుత్వం పన్ను రాయతీలతో పాటు ఆర్ధిక ప్రోత్సాహకాలు ప్రకటించింది అనీ వాటిని అమలు చెయ్యాలి అంటే కేంద్రం యొక్క ప్రాతిపదిక కావాలి అనీ అందుకే ఇక్కడకి వచ్చాను అనీ తెలిపారు ఆయన. " ఈ అంశం ఇప్పటికే పరిశీలనలో ఉంది అని మంత్రి చెప్పడం చాలా ఆనందకర విషయం. బహుళ ఉత్పత్తుల సెజ్ లు రెండు మంజూరు చెయ్యాలని నేను ఆమెని కోరాను, ప్రతిపాదనలు పూర్తి స్థాయి గా సిద్దం చేసుకుని రావాలి ఆమె కోరడం జరిగింది .. ఆమె చాలా సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం నిధులు కూడా అడిగాను  " అని కేటీఆర్ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: