పెరిగిపోతున్న సెల్ఫీ పిచ్చికి ఇదో ఉదాహరణ. విమానంలో ఎయిర్ హోస్టెస్‌తో సెల్ఫీ దిగాలన్న పిచ్చి ఇప్పుడు అతడిని కటకటాల పాల్జేసింది. ఎయిర్ హోస్టెస్ కు ఇష్టం లేకుండా బలవంతంగా స్వీయచిత్రాన్ని తీసుకునేందుకు ప్రయత్నించడంతో పాటు విమానం టాయిలెట్లో పొగతాగడంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహ్మద్ అబుబాకర్(29) అనే వ్యక్తి డామమ్ నుంచి ముంబయికి  విమానంలో బయలుదేరాడు. 
సెల్ఫీ కోసం ఎయిర్హోస్టెస్ చేయిపట్టిలాగి..

విమానం డామమ్ నుంచి బయలుదేరగానే తన అసభ్య ప్రవర్తన ప్రారంభించాడు. ఎయిర్ హోస్టెస్ విమానంలో నడుస్తుండగా ఆమె వెనుకాలే చప్పుడు చేయకుండా వెళ్లాడు. దీంతో నివ్వెరపోయిన ఆమె ఒక్కసారిగా కేకలు వేయడంతో క్రూ సిబ్బంది రంగంలోకి దిగారు. ఈ ఘటనపై సిబ్బంది, ఎయిర్ హోస్టెస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన ముంబై పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. 


సెక్యూరిటీ చెక్‌ను తప్పించుకుని అబూబకర్ విమానంలోకి సిగరెట్, లైటర్ ఎలా తీసుకురాగలిగాడన్న విషయంపై దర్యాప్తు జరపనున్నట్టు పోలీసులు తెలిపారు. అతడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరికీ పంపనున్నట్టు పేర్కొన్నారు. కాగా నిందితుడు అబూబకర్ గుజరాత్ వాసి అని సౌదీ అరేబియాలోని దమామ్‌లో ఓ హోటల్‌లో పనిచేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: