తెలంగాణ న్యాయాధికారుల విషయం లో డిల్లీ లో ఆందోళన కి తెలంగాణా ముఖ్యమంత్రి స్వయంగా సిద్దం అవుతున్నారు. ఎలా ముందుకు వెళ్ళాలి, ఇందులో తమ వ్యూహం ఏంటి అనే విషయాల మీద మంత్రివర్గ సహచరులతో , సీనియర్ నాయకులతో కెసిఆర్ మాట్లాడుతున్నారు అని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. జడ్జీల ఆందోళన నేపధ్యం లో సోమవారం చోటు చేసుకున్న పరిణామాలు కెసిఆర్ కి చాలా ఇబ్బంది కలిగించాయి అనీ తీవ్ర అసహనం తో పాటు కలచివేసాయి అని అంటున్నారు.

 

సో ఈ దెబ్బతో ఫైర్ అవుతున్న కెసిఆర్ తాడో పేడో తేల్చుకునే ఛాన్స్ తీసుకోబోతున్నారు అని మన వెబ్సైటు కి అందుతున్న విశ్వసనీయ సమాచారం. కేంద్రం నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే ఈ విషయాన్ని డిల్లీ లోని జంతర్ మంతర్ దగ్గర రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే లూ , ఎమ్మెల్సీ లు అందరూ కలిసి భారీ ఎత్తున ధర్నా లాంటిది నిర్వహించాలని చూస్తున్నారట. రాష్ట్రం రెండేళ్ళ క్రితం విభజనకి గురయ్యి అయినా కూడా హై కోర్టు విషయం లో ఇబ్బందికర పరిణామాలు ఏర్పాటు చేస్తూ ఇప్పటి వరకూ హై కోర్టు విభజించ లేదు అనేది వీరి వాదన. పైగా రాష్ట్ర విభజన చట్టాన్ని అవహేళన చేసేలా కేంద్రం ప్రవర్తిస్తోంది అనేది కెసిఆర్ కోపం. హై కోర్టు ని విభజించాలి అని అన్ని ప్రజాస్వామ్య పద్దతులలో విజ్ఞప్తులు చేసినా కానీ చివరికి పార్లమెంట్ సమావేశాల లో ప్రతీ సారీ తెరాస ఎంపీలు సభలో నిలబడి ఆందోళన చేసినా కేంద్రం కొంచెం కూడా పట్టించుకోకపోవడం తీవ్ర పరిణామం గా చెబుతున్నారు.

 

జడ్జీల నియామకం విషయం లో తెలంగాణా వారికి తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంటే తాము ఎలా చేతులు ముడుచుకుని కూర్చోవాలి అన్ని కెసిఆర్ ప్రశ్నిస్తున్నారు. అన్నింటా కేంద్రానికి రెస్పెక్ట్ ఇస్తూ వారి వైఖరు మారుతుందీ , తెలంగాణా ప్రజల కోరిక తీరుస్తూ హై కోర్టు విభజిస్తారు అని ఎదురు చూస్తూనే ఉన్నా ఇప్పటి వరకూ దానికి సంబంధించిన పని కొంచెం కూడా ముందుకు కదలకపోవడం తో కెసిఆర్ ఈ అభిప్రాయానికి వచ్చారు అని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: