అమెరికాలో చట్టవ్యతిరేకంగా నివసిస్తున్న వారిని వెనక్కి పిలిచేందుకు సహకరించని 23 దేశాలకు చెందిన వారికి అమెరికా ఇమ్మిగ్రంట్‌, నాన్‌ ఇమ్మిగ్రంట్‌ వీసాలను మంజూరు చేయకూడదని ఒక సెనెటర్‌ ఒబామా ప్రభుత్వాన్ని కోరాడు. భారతదేశం ,  చైనా సహా 23 దేశాల  పౌరులకు  ఇచ్చే వలస, వలసేతర వీసాలు జారీని ఆపి వేయాలని ఒబామా అడ్మినిస్ట్రేషన్ కు సూచించారు.  అక్రమ వలసదారులును తిరిగి స్వీకరించడంలో ఆయా దేశాలు సహకరించడం లేదని ఆరోపిస్తూ ఈ చర్యకు పక్రమించాయి.



అమెరికా నుంచి వెళ్లిపోవాల్సిన వారిని స్వదేశానికి పిలిపించడంలో విఫలమైన దేశాలను పట్టించుకోవడంలో ఒబామా సర్కారు విఫలమైందని పేర్కొన్నారు. దీంతో వేలకొద్దీ నేరగాళ్లు అమెరికా సమాజంలోకి చొరబుడుతున్నారని పేర్కొన్నారు. చాలా సందర్భాల్లో అమెరికా సమాజంలోకి అక్రమంగా చొరబడిన వారికి, వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉన్నవారికి నేరచరిత్ర ఉన్నట్లు రుజువైందని తన లేఖలో పేర్కొన్నారు.



అంతకుముందు రెండేళ్లలో 6,100 మంది విడుదలైతే ఒక్క 2015  లోనే 2,166 మందిని ఇలా విడుదల చేశామని తెలిపారు. ప్రస్తుతం, 23 దేశాలు అమెరికాతో సహకరించడం లేదని గ్రాస్లీ తన లేఖలో పేర్కొన్నారు. మొత్తం 62 దేశాలను అవియుధేలుగా గుర్తించినప్పటికీ,23 దేశాలను పెడసరి దేశాల ఖాతాలో చేర్చింది. ముఖ్యంగా క్యూబా, చైనా, సోమాలియా,  ఇండియా, గయానాలను మరింత  మొండిదేశాలుగా తేల్చి పారేసింది. వీటిని  టాప్ ఫైవ్ లిస్ట్ లో చేర్చింది.  ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టం 243(డీ) ప్రకారం  ఈ చర్యలు తీసుకోవాలని గ్రాసీ కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: