ఈ మద్య మద్యం మత్తులో యువకుల హంగామా అనే మాట బదులు యువతుల హంగామా అనే మాట వినాల్సి వస్తుంది. పెద్ద పెద్ద నగరాల్లో పబ్ కల్చర్ విస్తారంగా పెరిగిపోవడం..అమ్మాయిలు రాత్రి వరకు స్వేచ్చగా తిరగడం పార్టీలో మద్యం కాస్త ఎక్కువ మోతాదులో పుచ్చుకోవడంతో కొంత మంది అమ్మాయిలు రోడ్డుపై నానా హంగామా సృష్టిస్తున్నారు. వీరిని వారిండానికి వచ్చిన పోలీసులపై కూడా తిరగబడుతూ హల్ చల్ సృష్టిస్తున్నారు. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులోని మార్కెట్ ప్రాంతంలో మద్యం మత్తులో ఓ నైజీరియన్ యువతి రచ్చ రచ్చ చేసింది. ముందుగా ఓ షాపింగ్ మాల్‌లోకి వెళ్లిన ఆ యువతి తమ బడ్జెట్ కు తగ్గట్లుగా ఫోన్స్ లేకపోవడంతో షాప్ యజమానితో ఆమె గొడవకు దిగారు. షాప్ గ్లాసెస్ ను పగొలగొట్టింది.
బెంగళూరు మార్కెట్లో యువతి హల్చల్
ఈ తర్వాత ఆమె అక్కడ ఉన్న వస్తువులను కిందపడేసి విరగొట్టింది. అలాగే అందులో ఉన్నవ్యక్తులపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఆమె ఫుల్ గా మద్యం తాగి ఉండడంతో అడ్డుచెప్పిన వారందరిపై దాడి చేసింది. సమాచారం అందుకుని అక్కడి చేరుకున్న పోలీసులు కూడా ఆమెను ఆపలేకపోయారు. పోలీసులపైకీ దూసుకెళ్లింది ఆ నైజీరియన్ యువతి. చేసేదేమీ లేక మిన్నకుండిపోయారు పోలీసులు.

ఒక దశలో పోలీసులను పరుగెత్తించింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆమె వెనక నుంచి వచ్చి ఓ బట్టతో ముసుగేసి ఆమెను బంధించాడు. వెంటనే చేరుకన్న పోలీసులు.. ఆమె చేతులను కట్టేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా, సదరు యువతి డ్రగ్స్ కూడా తీసుకున్నట్లు పోలీసులు. మరో ట్విస్ట్ ఏంటంటే.. ఇంత వరకు ఆమెపై ఎవరై ఫిర్యాదు చేయలేదు. ఎవరైన ఫిర్యాదు చేస్తే వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. ' అని ఒక పోలీసు అధికారి తెలిపారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: