తొలి మహిళా క్యాబ్‌ డ్రైవర్‌గా గుర్తింపు పొందిన భారతి వీరత్‌ బెంగళూరులో మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భారతి గత పదేళ్లుగా బెంగళూరులో ఓ అద్దెగదిలో ఒంటరిగా ఉంటున్నారు. అయితే... గత ఆదివారం నుంచి భారతి కన్పించకపోవడంతో.. ఆమె నివాసముంటున్న ఇంటి యజమాని గదివద్దకు వెళ్లి చూడగా.. భారత మృతదేహం సీలింగ్‌కు వేలాడుతూ కన్పించింది. అతడు వెంటనే పోలీసులకు సమాచారమందించాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆమె మృతదేహం వద్ద ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదు. బెంగళూరులో మొదట టైలర్‌గా పనిచేసిన భారతి ... ఆ తర్వాత ఓ ఎన్జీవోలో చేరి డ్రైవింగ్‌ నేర్చుకుని రెండేళ్ల క్రితం ప్రముఖ క్యాబ్‌ సర్వీస్‌ సంస్థ ఉబర్‌లో డ్రైవర్‌గా చేరారు. దీంతో బెంగళూరు సిటీలో తొలి మహిళా ట్యాక్సీ డ్రైవర్‌గా ఆమె గుర్తింపు పొందారు. బెంగళూరులో తొలి మహిళా క్యాబ్ డ్రైవర్‌గా పేరుపొందిన భారతి వీరత్ (39) ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలుకు చెందిన వ్యక్తిగ గుర్తించారు. పదేళ్ల క్రితం బెంగళూరుకు వలవ వచ్చింది.

ఆమె మొదట టైలర్ గా పనిచేసేది..తరువాత ఓ ఎన్జీవో ఆమెకు కారు డ్రైవింగ్ లో శిక్షణ ఇచ్చింది. ఆమె ఊబర్ లో డ్రైవర్ గా చేరింది. ఆమె ఒంటరిగా నివసిస్తోంది. ఇటీవలే ఆమె తన స్వస్థలానికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు ఇంటి యజమానికి చెప్పింది. ఆమె రెండు రోజులుగా కనిపించకపోవడంతో ఇంటి యజమాని ఆమె ఫ్లోర్‌కు వెళ్లి చూశారు. కిటికీలోంచి చూడగా భారతి ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గదిలో ఎలాంటి సూసూడ్ నోట్ దొరకలేదు. ఆమె కారు ఇంటి ముందే పార్క్ చేసి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: