ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు..టార్గెట్ ఎవరైనా వీరి చేతిలో అమాయకులు ఘోరంగా బలైపోతున్నారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు పదుల్లో తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక్క మనిషి పుట్టి  పెద్దవారు కావాలంటే ఎన్నో వ్యయప్రయాసలు పడాల్సి ఉంటుంది..కానీ ఈ దుర్మార్గుల చేతుల్లో క్షణాల్లో పిట్టల్లా రాలిపోతున్నారు.  తాజాగా టర్కీ ప్రధాన నగరం, పర్యాటక ప్రాంతమైన ఇస్తాంబుల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ముష్కరులు పేట్రేగిపోయారు.  రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.  ఇస్తాంబుల్ ఈ ఏడాది ఇది నాలుగో బాంబు ఘటన. ఎయిర్ పోర్టులో ఉన్న సీసీ కెమెరాలు బాంబు పేలిన ఘటనలను రికార్డు చేశాయి.

సీసీ కెమెరాల్లో చూస్తుంటే..మండుతున్న అగ్ని గోళంలాంటిది వేగంగా వచ్చి పేలినట్టు ఉంది. మరొక వీడియోలో ఒక వ్యక్తి పరిగెట్టుకుంటూ బిల్డింగ్ లోపలికి వచ్చి కిందకు పడి తనను తాను పేల్చుకున్నట్లుగా కనిపిస్తుంది.  అయితే ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో ఎయిర్ పోర్టులోకి ప్రవేశించారు. వస్తూనే సెక్యూరిటీ గార్డులను చంపారు. అలాగే ప్రయాణికులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.  భద్రతాసిబ్బంది ఘటనాస్థలిని తమ ఆధీనంలోకి తీసుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముగ్గురు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడిలో పాల్గొన్నట్లు టర్కీ ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి.  మరణాల సంఖ్య 50కి పెరిగే అవకాశం ఉందని టర్కీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఎయిర్ పోర్టులో ఉగ్రవాదుల దాడుల సంగతి తెలియగానే ఆ దేశ అధ్యక్షుడు రెసెప్ తైపీ ఎర్డొగాన్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదంపై పోరుకు ప్రపంచదేశాలు కలిసిరావాలని కోరారు. ఇక ప్రధాని బినాలీ తమ విమానాశ్రయంపై దాడి చేసి, పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు బలిగొన్న ఉగ్రదాడి వెనక ఉన్న ఐఎస్ఐఎస్ ఉగ్ర సంస్థేనని టర్కీ ప్రధాని బినాలీ యెల్డిరిమ్ చెప్పారు. దుర్ఘటన జరిగిన ఇస్తాంబుల్ విమానాశ్రయానికి వెళ్లి, అక్కడి పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

blast



మరింత సమాచారం తెలుసుకోండి: