తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులలో కాస్త సెన్సిబుల్ గా మాట్లాడే వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్. మాజీ ఎంపీ గా ఉన్న ఆయన రాజకీయంగా చాలా ఉన్నతి కి వెళ్ళాల్సి ఉంది కానీ టైం సరిగ్గా లేక వెళ్ళలేదు. అయితే ప్రస్తుతం చంద్రబాబు మీద ఆయన చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వై ఎస్ బతికున్న రోజుల్లో ఆయనకి అత్యంత సన్నిహితుడుగా ఉండే ఉండవల్లి మంచి మాటకారి. తన మాటలతో అందరినీ విస్మయ పరిచే ఉండవల్లి ఈ మధ్య కాలం లో ఎక్కడా కనపడ్డం లేదు.

 

 వై ఎస్ మరణం తరవాత ఆయన దఫా పడిపోయింది. రాష్ట్ర విభజన సమయం లో సరైన స్పందన ఇవ్వకుండా నాన్చడం తో ఇలాంటి మేధావి కూడా లా పాయింట్ లు తీయకుండా విభజనకి సపోర్ట్ చేసాడు అన్నట్టు కోప్పడ్డారు జనాలు. క్రియాశీల రాజకీయాలలో పెద్దగా కనపడని ఆయన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్ళారు. ఆయన్ని కలిసి కాపు ఉద్యమం తీరు మొత్తం తెలుసుకున్నారు.

 

దీక్ష సమయం లో ఏపీ ముఖ్యమంత్రి హిట్లర్ - ముసోలినీ లాగా చంద్రబాబు తీరు ఉంది అని మండి పడుతున్నారు. ముసోలిని కాలం లో కూడా ప్రజా ఉద్యమాలు ఇలాగే నిర్వీర్యం చేసి వారి వారి ప్రాంతాలలో వారిని అడ్డుకుని ప్రజా ఉద్యమం పూర్తిగా అణచి పోయేలా చేసేవారు అని ఉండవల్లి అన్నారు. 13 రోజుల పాటు ముద్రగడ ని ఆసుపత్రి లో నిర్భంధించి మరీ మానసికంగా బలహీనుడిని చేసారు అని ఉండవల్లి సీరియస్ అయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: