బెంగళూరుకు చెందిన తొలి మహిళా క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం అందరికీ విదితమే. తన ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయింది. రెండేళ్లకిందట ఊబర్ క్యాబ్ డ్రైవర్గా ఆమె విధుల్లో చేరింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన భారతి వీరత్ అనే మహిళ తొలుత ఒక టైలర్గా పనిచేస్తుండేది. ఆమె ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా డ్రైవింగ్ నేర్చుకొని ఆ తర్వాత ప్రైవేట్ క్యాబ్ సంస్థ అయిన ఊబర్లో చేరింది. బెంగళూరులో తొలి మహిళా క్యాబ్ డ్రైవర్గా గుర్తింపుకెక్కింది. 

తొలి మహిళా క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్య


తొలి మహిళా క్యాబ్ డ్రైవర్ గా చరిత్ర సృష్టించి, ఆపై తన ఇంటిలో ఆత్మహత్య చేసుకున్న భారతీ వీరత్ మృతి వెనుక పలు నమ్మలేని నిజాలు వెలికిచూస్తున్నాయి. ఆమె ఒంటరితనం, మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. భారతి గతంలో లింగమార్పిడి చేయించుకుని పురుషుడిగా మారి, మరో మహిళతో కలిసి ఉంటోందని తెలుస్తోంది. వీరిద్దరి మధ్యా విభేదాలు తలెత్తగా, ఆ యువతి భారతిపై దాడి చేసి, విడిపోయి మరో వ్యక్తితో ఉంటోందని, ఈ కారణంగానే ఆమె తీవ్ర మానసిక ఒత్తిడిలో కూరుకుపోయి ఉండవచ్చని తెలుస్తోంది. 

తొలి మహిళా క్యాబ్ డ్రైవర్ ఎందుకు చనిపోయిందంటే..


బహుశా ఈ విషయం ఆమెను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసి ఉండొచ్చని చెబుతున్నారు. ఇటీవలె తన సొంత గ్రామానికి కూడా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లు స్నేహితులు చెప్పారు. ఆమెకు తెలిసిన వెంకటేశ్ అనే న్యాయవాదికి ఫోన్ చేసి ఒక చంటిబిడ్డను దత్తత తీసుకోవాలనుకుంటున్నానని, అందుకు సంబంధించిన న్యాయపరమైన సలహాలు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఈలోగా ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. పోస్టు మార్టం నివేదిక వచ్చిన తర్వాతే పోలీసులు ఆమె విషయంపై స్పష్టతను ఇస్తారని చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: