ఏపీలో రాజకీయాలు రోజుకో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు వైసీపి కి చెందిన రోజా అంశం పెద్ద గందరగోళం సృష్టిస్తే..వైసీపీ నుంచి చాలా మంది నాయకులు టీడీపీలోకి జంప్ అవతూ వచ్చారు. ఇక మొన్నటి వరకు కాపు లకు రిజర్వేషన్ కల్పించాలంటూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన నిరాహార దీక్ష గురించి అందరికీ తెలిసిన విషయమే..మొత్తానికి ఆయనకు కొన్ని హామీలు ఇచ్చి నిరాహార దీక్ష విరమింప జేపించారు. తాజాగా  వైకాపా అధినేత జగన్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది.

తాను ఎదుర్కొంటున్న అక్రమాస్తులు, మనీ లాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో భారీ అటాచ్ మెంట్ చేసింది.  ఇప్పటికే పార్టీ పిరాయింపులతో నేతలను కోల్పోతున్న ఆయనకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ( ఈడీ) పెద్ద షాక్ ఇచ్చింది.అక్రమాస్తుల కేసుకు సంబంధించి బుధవారం భారీ ఎత్తున్న ఆస్తులను అటాచ్ మెంట్ చేసింది.

హైదరాబాద్ లోటస్ పాండ్ బెంగుళూరు లోని మంత్రి ఎట్ కామర్స్ భవనాలను అటాచ్ మెంట్ చేసిన ఈడి. పలు కంపెనీల షేర్లను కూడా ఈ అటాచ్ లో ఉంచారు. ఇందులో భారతి సిమెంట్స్ కు సంబంధించి ఆస్తులు కూడా ఈ జాబితాలో ఉన్నాయనే సమాచారం.  జగన్, భారతి పేరిట పలు కంపెనీల్లో ఉన్న షేర్లు కూడా అటాచ్.  సున్నపురాయిని అక్రమంగా కేటాయించినట్లు నిర్ధారణ. ఈ అటాచ్ మెంట్ తో జగన్ కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న ఆస్తులన్నీ అటాచ్ అయినట్లే.గతంలో నాలుగు సార్లు జగన్ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: