పరమానంద శిష్యుల కథ మన అందరికీ పరిచితమే.. గురువు గారు చెప్పే మాటల్లోని భావాన్ని అర్థం చేసుకోకుండా వాటిని తుచా తప్పకుండా పాటిస్తూ వారు మూర్ఖత్వంతో చేసే హంగామా కడుపుబ్బా హాస్యం పండిస్తుంది. అలాంటి పరమానంద శిష్యులు ఇంకా ఉన్నారని తాజాగా బెలారస్ దేశంలోని ఉద్యోగులు రుజువు చేస్తున్నారు. 




ఇటీవల బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో  దేశ ఆర్థికాభివృద్ధికి అంకితభావంతో కష్టపడి పనిచేయాలని ఉద్యోగులకు పిలుపు ఇచ్చారు. రొటీన్ గా చెబితే పెద్దగా పట్టించుకోరు అనుకున్నాడో ఏమో.. కాస్త డిఫరెంట్ గా స్లోగన్ ఇచ్చాడు. ‘గెట్ అన్‌డ్రెస్డ్ అండ్ వర్క్ టిల్ యు గెట్ స్వెట్ ’ అని నినాదం ఇచ్చాడు. 



లుకషెంకో అంటే అప్పటికే కోపంగా ఉన్నారో ఏమో.. ఆ దేశ ఉద్యోగులు ఆ మాటలను యథాతథంగా అమలు చేయడం ప్రారంభించారు. కష్టపడి పనిచేయడం అనే భావాన్ని పక్కకు పెట్టి నిజంగానే బట్టలు విప్పేసి పని చేస్తున్నారు. అంతే కాదు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కొత్త రకం నిరసన తెలుపుతున్నారు. 



లుకషెంకో పిలుపునకు మహిళా ఉద్యోగులు సైతం బాగానే స్పందిస్తున్నారు. తోటి ఉద్యోగులతో పాటు వారు కూడా బట్టలు విప్పేసి నగ్నంగా పని చేస్తున్నారు. కంప్యూటర్లు అడ్డంపెట్టుకుని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇప్పుడు ఈ నగ్న ఉద్యోగుల ఇష్యూ అంతర్జాతీయంగా హాట్ టాపిక్ అయ్యింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: