అమరావతి నిర్మాణం పేరుతో చంద్రబాబు, ఆయన కుటుంబం కోట్ల కూడబెట్టుకుంటున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. రాజధాని భూకేటాయింపుల్లో, భూ అక్రమాల్లో చంద్రబాబు కుమారుడు లోకేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారని పదే పదే టార్గెట్ చేస్తోంది. తాజాగా చెన్నైలో సదావర్తి భూముల కుంభకోణంలోనూ లోకేశ్ దే కీలక పాత్ర అంటోంది. 

ఇలా ప్రతిసారీ తననే టార్గెట్ చేయడాన్ని చంద్రబాబు కుమారుడు లోకేశ్ కూడా సీరియస్ గా తీసుకుంటున్నారు. అందుకే తాజాగా విజయవాడలో జరిగిన ఓ సభలో వైసీపీకి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తనపై తనపై ఆరోపణలు ఉంటే రుజువు చేయాలని సవాల్ చేశారు. ఏ ఒక్క ఆరోపణను వైసీపీ రుజువు చేయగలిగినా తానే స్వయంగా వెళ్లి జైల్లో కూర్చుంటానని సవాల్ విసురుతున్నాడు. 


ప్రతిపక్ష నేత జగన్.. కావాలనే తనను టార్గెట్ చేస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు. చేతిలో పత్రిక ఉంది కదా అని విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు సర్కారు ప్రజల కోసం పని చేస్తోందని.. సీఎం పనితీరు విపక్షనేతలను సైతం ఆకట్టుకుంటోందని లోకేశ్ కితాబు ఇచ్చారు. 

వైసీపీ నుంచి 20 మందికి పైగా ఎమ్మెల్యేలు తమ అభివృద్ధి చూసి జగన్ కు గుడ్ బై చెప్పి తమవైపు వచ్చారన్న సంగతి ఆయన మరచిపోరాదని లోకేశ్ కౌంటర్ వేశారు. జగన్ ఏపీ ప్రజలను కులాలు, మతాల వారీగా విడగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వాటిని అడ్డుకోవాలని లోకేశ్ పిలుపు ఇచ్చారు.  ముస్లింలకు నాలుగుశాతం రిజర్వేషన్ ల విషయం సుప్రింకోర్టులో పెండింగులో ఉందని, మంచి లాయర్లను పెట్టి వాటిని సాధిస్తామని లోకేశ్ అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: