ప్రపంచంలో కొన్ని వింత సంఘటనలు చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ముఖ్యంగా సోషల్ మాద్యమాల ద్వారా ఇవి ప్రపంచానికి ఇట్టే తెలిసిపోతున్నాయి. అయితే వింత వింత జననాలు కూడా ఈ మద్య చాలా మందిని ఆశ్చర్యాన్ని కల్పిస్తున్నాయి. ఒక బాబుకి చేతి వేళ్లు, కాలి వేళ్లు అధికంగా ఉండటం..రెండు తలలతో పుట్టడం..రెండు చేతుల బదులు నాలుగు చేతులతో ఇలా రక రకాల వింత శిశువులు పుడుతుంటారు. అయితే వైద్య శాస్త్ర ప్రకారం జన్యులోపం వల్ల జరిగే మార్పిడితోనే ఇలాంటి శిశువులు జన్మిస్తారని చెబుతున్నారు. తాజాగా వయస్సు 10 ఏళ్లు.. బరువు మాత్రం 192 కిలోతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు ఓ బుడుతడు. ఇండోనేషియాకు చెందిన ఆర్యా పెర్మనా పుట్టినపుడు చాలా నార్మల్ గా ఉన్నాడట.

కానీ రెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత బాలుడిలో అనుకోని మార్పులు జరగడం ప్రారంభించిందట. రెండేళ్ల వయసులోనే ఆసాధారణరీతిలో పెరుగుదల కనిపించింది. బరువు పెరుగుతున్నా కొద్ది తిండిలో కూడా మార్పు రావడం అధికంగా తినడం జరుగుతుందట.

ఇక మనోడు బయట పిల్లలతో ఆడుకునే పరిస్థితిలో లేకపోవడంతో ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతాడట..తినడం,పడుకోవడం అప్పుడప్పుడు ఇంట్లో ఏర్పాటు చేసిన చిన్న స్విమ్మింగ్ ఫుల్ లో స్నానం చేయడం ఇదే ఆ బుడ్డోడి దినచర్య. ప్రడర్-విల్లి సిండ్రోం ఆనే వ్యాధితో వున్నడని స్థానిక డాక్టర్లు నిర్ధారించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: