సెల్ఫీ ల పిచ్చి మామూలుగా లేదు ఈ రోజుల్లో, ప్రతీ సెలెబ్రిటీ తో - ప్రతీ స్పోర్ట్స్ పర్సన్ తో - ప్రతీ సినిమా వ్యక్తి తో సెల్ఫీ దిగడమే ఈ రోజుల్లో మోజుగా మారింది . ఒక పక్క అత్యాచార బాధితులతో దేశం విలవిలలాడిపోతోంది. వాళ్ళ విషయం లో ప్రభుత్వం సీరియస్ గా ఉంటూ ఆడపిల్లల రక్షణ కోసం నిరంతరం పోరాడుతూ ఉంటె రాజస్థాన్ లో ఒక అమానవీయ చర్య జరిగింది.

 

రాజస్థాన్ మహిళా కమీషన్ సభ్యురాలు సోమయా గుర్జర్ ఏకంగా ఆమెతో సెల్ఫీ దిగారు.  గ్యాంగ్ రేప్ కి గురైన ఒక అమ్మాయి తో ఆమె దిగిన సెల్ఫీ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఇదే సేల్ఫే ఎలో కమీషన్ చైర్ పర్సన్ సుమన్ శర్మ కూడా ఉండడం ఇంకా బాధ కలిగించే విషయం. జైపూర్ లో తీవ్రంగా గ్యాంగ్ రేప్ కి గురైన బాధితురాలి తో మాట్లాడడానికి వెళ్ళిన గుర్జర్ మరియూ సుమన్ ఆమెతో మాట్లాడుతున్న సమయం లో ఈ సేల్ఫీ తీసారు. సుమన్ శర్మ మాత్రం ఆమె సేల్ఫీ తీసారు అనే విషయం కూడా తెలీదు అని చెబుతున్నారు. ఈ విషయం మీద రాతపూర్వక వివరణ సుమన్ స్వయంగా ఆమెని కోరాడ౦ విశేషం.

 

ఇలాంటి వాటిని ఒప్పుకోను అనీ ఇది చాలా విషాదకరమైన విషయం అనీ ఆయన చెబుతున్నారు. ఆమె మొత్తం రెండు సెల్ఫీ లు దిగి ఒకటి వాట్స్ యాప్ లో రెండోది ఫేస్ బుక్ లో పెట్టారు. ఈ రెండు చోట్లా దీని మీద సీరియస్ కామెంట్ లు పడ్డాయి. సిగ్గుండాలి అనీ ఒక కమీషన్ వ్యక్తి ఇలా చేస్తే ఇక ఆడవారు ఆపదలో ఉన్నప్పుడు వారిని ఎలా కలుస్తారు అంటూ సీరియస్ అవుతున్నారు సోషల్ నెట్వర్కింగ్ జనాలు. రాజస్థాన్ లో సొంత భర్త అతని సోదరులు ఇద్దరు ముప్పై సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయి తో ఈ దారుణం చేసారు. ఆమె ని అదనపు కట్నం తెమ్మనగా ఆమె తండ్రి ఇచ్చుకోలేను అని గొడవ చెయ్యడం తో ఈ దారుణం చేసారు వారు. 

 


మరింత సమాచారం తెలుసుకోండి: