హైకోర్టు విభజన అంశం ఏపీ, తెలంగాణ మధ్య మరో వివాదానికి కారణమవుతోంది. ఏపీ విభజనలాగానే ఈ హైకోర్టు విభజన కూడా టీడీపీకి రాజకీయంగా ఇబ్బందికరంగా మారుతోంది. ప్రత్యేకించి తెలంగాణ టీడీపీ నేతలు అటు ఏపీ వైఖరిని విమర్శించలేక.. ఇటు తెలంగాణవాదులను సమర్థించలేక మధ్యలో నలిగిపోతున్నారు. 

ఈ నేపథ్యంలో తెలంగాణవాదుల విమర్శల నుంచి తప్పించేందుకు తెలంగాణ న్యాయాధికారుల ఆందోళనకు తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మద్దతు ఇవ్వకతప్పలేదు. కాకపోతే తమ మద్దతు న్యాయాధికారులకే తప్ప తెలంగాణ రాష్ట్ర సమితికి కాదనే విషయాన్ని తేట తెల్లం చేసేందుకు కేసీఆర్ ఫ్యామిలీని మరోసారి టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి.


ఆంధ్ర జడ్జిలపై ఆరోపణలు చేస్తున్న కవితపై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు అవసరమైనప్పుడు ఆంద్ర జడ్జిలనుకునేవారి ఇళ్లకు వెళ్లి వారి కాళ్లు పట్టుకుని సన్మానం చేశారని ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేస్తున్నారు. ఆంద్ర న్యాయమూర్తుల ద్వారా చంద్రబాబు తెలంగాణపై పెత్తనం చేయాలని చూస్తున్నారన్న కవిత కామెంట్లు దివాళాకోరు తనమన్నారు. 

ఆ మధ్య కేసీఆర్ తెలంగాణ బాగు కోసమంటూ యాగం చేసినప్పుడు హైకోర్టు జడ్డిలను ఆ యాగానికి ఆహ్వానించారు. ప్రత్యేకంగా స్వయంగా జడ్జీల ఇళ్లకు వెళ్లి ఆహ్వానించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని హైలెట్ చేస్తున్నారు. మీకు అవసరమైనప్పుడు కాళ్లు పట్టుకుని సన్మానాలు చేస్తారా ? లేకుంటే మా ఖాతాలో నిందలు వేస్తారా అని కౌంటర్లు వేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: