టీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత నెంబర్ టూ ఎవరు .. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత సులభం కాదు.. సమాధానంగా రెండు పేర్లు చెప్పమంటే మాత్రం సింపుల్ గా చెప్పేస్తారు. వారిద్దరే కేటీఆర్, హరీశ్ రావు. మరి ఈ ఇద్దరిలో కేసీఆర్ తర్వాత స్థానం ఎవరిదంటే మాత్రం చెప్పడం కష్టమే. 

కాకపోతే పార్టీలో సీనియరే అయినా స్వయంగా కేసీఆర్ కుమారుడే పోటీలో ఉండటంతో హరీశ్ రావు కాస్త వెనుకడుగు వేయక తప్పడం లేదు. ముందొచ్చిన చెవుల కన్నా.. వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు పార్టీలో ముందు నుంచీ ఉన్న హరీశ్ కంటే.. వెనక వచ్చిన కేటీఆర్ ఇప్పుడు నెంబర్ టూ స్థానంలో దూసుకెళ్తున్నాడు. 


తన ప్లస్, మైనస్ పాయింట్లేమిటో తనకు బాగా తెలుసు కాబట్టి హరీశ్ రావు కూడా సంయమనం పాటిస్తూ పార్టీలో నెగ్గుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో తన జీవితంలో ఇప్పుడు నిర్వహిస్తున్న నీటి పారుదల శాఖ మంత్రి పదవి అతిపెద్దదని హరీశ్ అన్నారు. అంతే కాదు.. ఇంతకన్నా పెద్ద పదవి తనకు రాదని హరీశ్ రావు కామెంట్ చేయడం ఆసక్తికర చర్చకు తెర లేపింది.  

అంటే సీఎం రేసులో తాను లేనని హరీశ్ చెప్పకనే చెప్పారన్నమాట. అయితే కేసీఆర్ ఉండగా ఇప్పటికిప్పుడు సీఎం పదవికి పోటీ అనే ప్రస్తావనే రాదు.. ఈ చర్చ అంతా కేసీఆర్ తర్వాత ఎవరు అన్నప్పుడే కదా.. ఏదేమైనా ఈ హరీశ్ కామెంట్లు వింటే.. కేటీఆర్ సంతోషపడటం ఖాయం. హరీశ్ కూడా ఇప్పుడే వివాదం ఎందుకన్న ధోరణిలో ఉన్నట్టున్నారు. లేకపోతే నెంబర్ 3 పొజిషన్ కు మెంటల్ గా ప్రిపేరయ్యారేమో..!?  



మరింత సమాచారం తెలుసుకోండి: